Nitish Kumar: బీజేపీతో బంధం తెంచుకుంటేనే.. జేడీయూ అధినేతకు రాష్ట్రపతి పదవిపై ఎన్సీపీ కీలక వ్యాఖ్యలు..

2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగారు జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ అధినేత నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar). ఈ ఎన్నికల్లో కమలం పార్టీ అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీశ్‌ కుమార్‌కే అప్పగించారు.

Nitish Kumar: బీజేపీతో బంధం తెంచుకుంటేనే.. జేడీయూ అధినేతకు రాష్ట్రపతి పదవిపై ఎన్సీపీ కీలక వ్యాఖ్యలు..
Nitish Kumar
Follow us
Basha Shek

|

Updated on: Feb 23, 2022 | 6:00 AM

2020లో జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి బరిలోకి దిగారు జనతాదళ్‌(యునైటెడ్‌) పార్టీ అధినేత నితీశ్‌ కుమార్‌ (Nitish Kumar). ఈ ఎన్నికల్లో కమలం పార్టీ అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని నితీశ్‌ కుమార్‌కే అప్పగించారు. అయితే ఇప్పుడీ కూటమిలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే ఇటీవల నితీశ్‌ పలు సందర్భాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభత్వంపై బహిరంగంగానే విమర్శలు గుప్పించడం ఈ పుకార్లకు బలం చేకూరుతోంది. ఇదిలా ఉండగానే తన పాత మిత్రుడు ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (Prashant Kishor) తో ఇటీవల రహస్యంగా భేటీ అయ్యారు నితీశ్‌. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన జేడీయూ అధినేత పీకేతో భేటీలో ఎలాంటి రాజకీయ కోణం లేదని చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై చర్చించేందుకే పీకేతో ఆయన సమావేశమైనట్లు ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.

కాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బిహార్‌ ముఖ్యమంత్రి బరిలో దిగనున్నారన్న వార్తల నేపథ్యంలో నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌  కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే నితీశ్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ‘విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్‌ పేరును ప్రకటించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికపై అన్ని పార్టీల నాయకులు చర్చించుకున్న తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుంది. కానీ కమలం పార్టీ పొత్తు నుంచి బయటకు వచ్చేంతవరకు నితీశ్ పేరుపై ఎలాంటి చర్చ జరిగే అవకాశాలుండవు. ముందు ఆయన బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలి. ఆ తర్వాతే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అన్న అంశంపై చర్చ ప్రారంభిస్తాం’ అని నవాబ్ మాలిక్‌ చెప్పుకొచ్చారు.

Also Read:TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి

Astrology: ఈ రాశుల అమ్మాయిలు అందరి దృష్టిలో పడేందుకు తెగ ట్రై చేస్తారు.. డ్రామా క్వీన్స్ వీళ్లే..

YS Viveka Murder Case: అప్రూవర్‌గా మారిన దస్తగిరి బెదిరింపు కాల్స్‌.. సీబీఐకి మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చిన దస్తగిరి