RJ Rachana: మరో సెలబ్రిటీని బలి తీసుకున్న గుండె పోటు.. పాపులర్ రేడియో జాకీ రచన హఠాన్మరణం..
గుండెపోటు (Cardiac Arrest)తో సెలబ్రిటీల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి.
గుండెపోటు (Cardiac Arrest)తో సెలబ్రిటీల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్, నిన్న ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విషాదాలు మరువకముందే, తాజాగా మరో సెలబ్రిటీ గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన ఆర్జే రచన (RJ Rachana) (39) ఆకస్మిక మరణం అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం జేపీ నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే రచన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్జేగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రచన హఠాన్మరణంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
పదేళ్లుగా బెంగళూరులోని ప్రతి ఇంట్లో సుపరిచితురాలిగా మారింది ఆర్జే రచన. తన వాక్చాతుర్యం, సెన్సాఫ్ హ్యూమర్‌తో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. కాగా కొంత కాలంగా రచన మానసిక ఒత్తిడికి లోనైనట్లు ఆమె స్నేహితులు చెప్తున్నారు. స్నేహితులకు కూడా దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. రేడియో మిర్చితో తన కెరీర్‌ను ప్రారంభించిన రచన.. రేడియో సిటీలో కొంత కాలం పని చేశారు. ఏడేళ్ల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఆర్జేగా స్థిరపడ్డారు. కాగా ఆర్జే రచన భౌతికకాయాన్ని చామరాజ్‌పేట్‌లోని నివాసానికి తరలించారు ఆమె తల్లిదండ్రులు. అంత్యక్రియలు ఎప్పుడు నిర్వహిస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అటు పునీత్, ఇటు ఆర్జే రచన లోకాన్ని వీడటం అభిమానులను తీవ్రంగా కలచివేసింది. తన మాటలు, జోక్‌లతో అభిమానులను ఉర్రూతలూగించిన రచన మరణం అభిమానుల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇకపై ఆమె మాటలు వినలేకపోతున్నామనే బాధ వారిని వెంటాడుతోంది. ఆర్జేల్లో ఉన్నతస్థాయికి ఎదిగిన రచన, ఇలా గుండెపోటుతో మృత్యుఒడిని చేరడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబసభ్యులు. రచన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖులు.
Also Read: TTD: తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్.. మార్చి 10న విదేశీ నాణేల ఈ-వేలం… వినియోగించుకోండి
RUSSIAN INVASION: పుతిన్ ప్రకటనపై అమెరికా, యుకే ఆగ్రహం.. రష్యాపై ఆంక్షల వర్షం.. తప్పేనా ముప్పు?