RUSSIAN INVASION: పుతిన్ ప్రకటనపై అమెరికా, యుకే ఆగ్రహం.. రష్యాపై ఆంక్షల వర్షం.. తప్పేనా ముప్పు?

అనుకున్నంత అయ్యింది. ఉక్రెయిన్ మీద కన్నేసిన రష్యా... అమెరికా సహా నాటో దేశాలన్నీ హెచ్చరించినా వినకుండా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు పోతూనే వుంది. యుద్దానికి సన్నద్దమవుతున్నట్లుగా నెల రోజుల నుంచి విన్యాసాలను ప్రారంభించిన రష్యా..

RUSSIAN INVASION: పుతిన్ ప్రకటనపై అమెరికా, యుకే ఆగ్రహం.. రష్యాపై ఆంక్షల వర్షం.. తప్పేనా ముప్పు?
Russia Ukraine News
Follow us
Rajesh Sharma

| Edited By: Sanjay Kasula

Updated on: Feb 22, 2022 | 10:17 PM

RUSSION INVASION PUTIN STATEMENT LEADING SANCTIONS AGAINST MASCOW: అనుకున్నంత అయ్యింది. ఉక్రెయిన్ మీద కన్నేసిన రష్యా… అమెరికా సహా నాటో దేశాలన్నీ హెచ్చరించినా వినకుండా ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకు పోతూనే వుంది. యుద్దానికి సన్నద్దమవుతున్నట్లుగా నెల రోజుల నుంచి విన్యాసాలను ప్రారంభించిన రష్యా.. చివరికి ప్రత్యక్ష దాడికి ముందే ఓ సంచలన ప్రకటన చేసింది. తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో రష్యన్లు అధికంగా వుండి రెబల్ రీజియన్లుగా పేరు గాంచిన రెండు డొనెట్స్క్, లుహాన్స్క్‌ ప్రావిన్సులను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ఫిబ్రవరి 21న రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ స్వయంగా ప్రకటన చేశాడు. ఈ మేరకు డిక్రీ మీద సంతకం కూడా చేసినట్లు వెల్లడించారు. నెల రోజుల నుంచి అమెరికా, యుకే సహా నాటో దేశాలు ఉక్రెయిన్ విషయంలో దూకుడు పనికి రాదని, చర్చల ద్వారా పరిష్కారం కనుగొందామని చేసిన ప్రకటనలను పుతిన్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదని రెబల్ ప్రావిన్సులకు గుర్తింపు నివ్వడం ద్వారా నిరూపించారు. ఉక్రెయిన్ దేశానికి మూడు వైపులా సైనిక దళాలను, సాయుధ సంపత్తిని మోహరించి.. ఇక యుద్దమే తరువాయి అన్నట్లుగా దూకుడు ప్రదర్శించిన పుతిన్.. చివరికి యుద్దానికి ముందు నాటో దేశాలకు, మరీ ముఖ్యంగా ఉక్రెయిన్ దేశాధినేత జెలెన్స్కీకి పెద్ద షాకే ఇచ్చాడు. రెండు ప్రావిన్సులను స్వయం స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన వెంటనే అప్పటికే ఉక్రెయిన్ దేశ తూర్పు సరిహద్దులో మోహరించిన పదాతి దళాలను ఆ రెండు ప్రావిన్సులను పంపడం ప్రారంభించాడు. ఫిబ్రవరి 22వ తేదీన ఈరకంగా ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యన్ దళాలు చొచ్చుకుపోవడం ప్రారంభమైంది. రష్యా చర్యలతో ఉలిక్కి పడ్డ పాశ్చాత్య దేశాలు అమెరికా, యుకే పుతిన్ మీద అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. వెంటనే చర్యలకు ఉపక్రమించాయి. అటు ఐక్యరాజ్యసమితి కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

నిజానికి ఫిబ్రవరి 16వ తేదీనే రష్యా దురాక్రమణ మొదలవుతుందని అమెరికా హెచ్చరించింది. అందుకు తగినట్లే రష్యన్ సైన్యం విన్యాసాలను పదునెక్కించింది. కానీ..కారణాలేవైతేనేం ఆ రోజున రష్యా వెనక్కి తగ్గుతున్నట్లు బూటకపు ప్రకటన చేసి ఊరుకుంది. ఉక్రెయిన్ సరిహద్దులో వున్న రష్యన్ దళాలు వెనక్కి వచ్చేస్తున్నాయని పుతిన్ ప్రకటించాడు. కానీ.. ఆ ప్రకటన బూటకమేనని అమెరికా, ఉక్రెయిన్, యుకే దేశాలు వాదించాయి. అందుకు కావాల్సిన సాక్ష్యాలను చూపుతున్నట్లు కొన్ని వీడియోలను రష్యా విడుదల చేసినప్పటికీ పుతిన్ ప్రకటనను ఎవరూ నమ్మలేదు. చివరికి అమెరికా, ఉక్రెయిన్ దేశాధినేతల అనుమానమే నిజమైంది. సరిహద్దు నుంచి తమ దళాలను వెనక్కి రప్పిస్తున్నట్లు ప్రకటించిన పుతిన్.. అందుకు భిన్నంగా అదనపు దళాలను ఉక్రెయిన్ బోర్డర్‌కు పంపడం మొదలు పెట్టారు. ఫిబ్రవరి 16న రష్యా వ్యూహాత్మకంగానే వెనక్కి తగ్గినట్లు నటించిందని ఫిబ్రవరి 21న పుతిన్ చేసిన ప్రకటన నిరూపించింది. నిజానికి ఫిబ్రవరి 16 నుంచి ఉక్రెయిన్ దేశంలోని రష్యా అనుకూల తీవ్రవాద సంస్థలు, వేర్పాటు వాదులు దాడులు ప్రారంభించారు. వారిని నిలువరించడానికి ఉక్రెయిన్ మిలిటరీ రంగంలోకి దిగిన వెంటనే రష్యా తమ ప్లాన్ బీని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే ఉక్రెయిన్‌లోని డొనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు రష్యా ప్రకటించి అందరికీ షాకిచ్చింది.

పుతిన్ ప్రకటనతో అగ్గిమీద గుగ్గిలమైన బైడెన్, బోరిస్ జాన్సన్ రష్యా మీద ఆంక్షల అస్త్రాలకు తెరలేపారు. యుకెలో పని చేస్తున్న 6 రష్యాన్ బ్యాంకులపై బ్యాన్ విధించారు. తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని బోరిస్ జాన్సన్ వ్యూహంగా కనిపిస్తోంది. అటు అమెరికా కూడా అదే విధమైన మరిన్ని కఠినమైన ఆంక్షలను విధించేందుకు సిద్దమవుతోంది. ఏ క్షణమైనా బైడెన్ ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. పుతిన్ అనుకున్నది చేసేశాడు. ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేసేశాడు. ఉక్రెయిన్‌ ఉనికినే ప్రశ్నిస్తూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు పుతిన్‌. ఉక్రెయిన్‌లో రెండు వేర్పాటువాద ప్రాంతాలను ప్రత్యేక దేశాలుగా గుర్తిస్తూ ప్రకటన చేసింది రష్యా. పుతిన్‌ అనూహ్యంగా తీసుకున్న నిర్ణయంతో ఉక్రెయిన్‌కు మెయిన్‌ సపోర్టుగా ఉంటూ వస్తున్న అమెరికా ఖంగుతిన్నది. ఉక్రెయిన్‌ను మూడు ముక్కలు చేయడం ద్వారా వార్‌కి సైరన్ మోగించారు పుతిన్‌. డొనెట్స్క్, లుహాన్స్క్‌ల‌ను స్వతంత్ర దేశాలుగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్‌. వెంటనే ఆ ప్రాంతాల్లో తన సైన్యాన్ని మోహరించారు. 2014 నుంచి రెబల్స్‌ గుప్పిట్లో ఉన్న డొనెట్స్క్, లుహాన్స్క్‌ లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు పుతిన్. రష్యా తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు మంటలు రాజేస్తోంది. యుద్ధాన్ని అనివార్యం చేసేలా కనిపిస్తోంది. డొనెట్స్క్, లుహాన్స్క్‌.. ఈ రెండు ప్రాంతాలూ ఉక్రెయిన్‌ దేశంలో భాగం. కానీ, ఎన్నో ఏళ్లుగా అక్కడి రష్యన్ అనుకూల వేర్పాటు వాదులు ఇండిపెండెన్స్‌ కోసం పోరాడుతున్నారు. తమను స్వతంత్ర దేశాలుగా గుర్తించాలని ఫైట్‌ చేస్తున్నారు రెబల్స్‌. భౌగోళికంగా ఈ ప్రాంతాలు రష్యా బోర్డర్‌లో ఉన్నాయి. పైగా రెబల్స్‌ స్థావరాలన్నీ రష్యా బోర్డర్‌లో ఉన్నాయి. ఇదే, ఇప్పుడు రష్యాకు అడ్వాంటేజ్‌గా మారింది.

ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉండే డొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించడంతో పుండు మీద కారం చల్లినట్టయ్యింది. ఉద్రిక్తతలు చల్లారాయనుకునేలోపే మళ్ళీ ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్మేశాయి. రష్యా నిర్ణయంపై అమెరికా ఫైరైంది. ఇది దాడికి సంకేతమంటూ ఉక్రెయిన్‌ను అలర్ట్‌ చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగడం ఖాయమనే నిర్ణయానికి వచ్చేసిన ఐక్యరాజ్యసమతి.. కఠినమైన ఆంక్షలు విధిస్తూ డెసిషిన్ తీసుకుంది. బీకేర్‌పుల్‌ అంటూ రష్యాకు వార్నింగ్ ఇచ్చింది యూరోపిన్‌ యూనియన్. అయినా ఎవరి హెచ్చరికలను, ఆంక్షలను లెక్కచేయిని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన వ్యూహాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే, మరోవైపు ఎటాక్స్‌ చేస్తోంది రష్యా. డొనెట్స్క్, లుహాన్స్క్‌లో రెబల్స్‌ను ఉసిగొల్పుతూ… తూర్పు ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగిస్తోంది. చొరబాటు పేరుతో ఉక్రెయిన్‌ ఆర్మీ వెహికల్స్‌ను పేల్చేసిన రష్యా, ఐదుగురు సైనికులను కాల్చిచంపింది. బైడెన్‌-పుతిన్‌ చర్చలకు రూట్‌ క్లియరైనవేళ, ఐదుగురు ఉక్రెయిన్‌ సైనికులను కాల్చిచంపేసింది రష్యా. సేమ్‌ టైమ్‌, ఉక్రెయిన్‌ ఆర్మీ వెహికల్స్‌ను పేల్చేసినట్లు ప్రకటించింది. దాంతో, ఉక్రెయిన్‌, రష్యా బోర్డర్‌లో ఒక్కసారిగా యుద్ధ మేఘాలు కమ్మేశాయి. మొదట్నుంచీ పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది రష్యా. స్టెప్‌ బై స్టెప్‌ తన ప్లాన్‌ను అమలు చేసుకుంటూ పోతోంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు డొనెట్స్‌, లుహాన్స్‌ ప్రాంతాలను స్వతంత్ర హోదా ప్రకటించింది రష్యా. ఇక, అమెరికా చెప్పినట్టుగానే బెలారస్‌ నుంచే రష్యా విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా ఉక్రెయిన్ దేశం రష్యా కబంధ హస్తాల్లో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తమ ప్రాంతాలను రష్యా స్వతంత్ర దేశాలు ప్రకటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న ఉక్రెయిన్ ప్రభుత్వం యుద్దానికి దిగితే జరిగే అపార నష్టాన్ని అంచనా వేస్తోంది. అమెరికా, యుకే ఎలాగో తమకు అండగా యుద్దరంగంలోకి దిగుతాయని భావిస్తున్న ఉక్రెయిన్ ప్రెసిడెంట్.. అయినా కూడా తమకే ఎక్కువ నష్టం వాటిల్లడం ఖాయమని, యుద్దంలో వేలాది మంది మరణించడం ఖాయమని ప్రకటించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం మినహా మరో దారి లేని పరిస్థితిలో పుతిన్ చర్చలకు ఏ మాత్రం మొగ్గు చూపకపోవడం గమనార్హం. తానే స్వయంగా పుతిన్ తో చర్చలకు వస్తానని బైడెన్ ప్రకటన చేస్తే.. అబ్బెబ్బె.. అమెరికా ప్రెసిడెంట్‌తో చర్చలకు ఇంకా సమయం రాలేదన్న రష్యా.. ఆ ప్రతిపాదనను పక్కన పెట్టేసి మరీ తమ ప్లాన్‌ను అమలు చేస్తోంది. ఈ తరుణంలో శాంతి కాముక దేశాలన్నీ ఏకమై రష్యాపై ఒత్తిడి తీసుకురాకపోతే.. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన వివాదం చినికి చినిక గాలి వానగా మారి.. మూడో ప్రపంచ యుద్దంగా మారక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: MISSION DELHI: ఉద్ధవ్, పవార్‌లతో కేసీఆర్ అత్యవసర భేటీకి అసలు మతలబు అదేనా..?

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!