‘కైలాసం’ నుంచి నిత్యానంద పరార్.. మరో ద్వీపం కోసం..

అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద.. దేశం వదిలి పారిపోయి.. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఓ ద్వీపాన్ని కొన్న సంగతి తెలిసిందే. దానికి ‘కైలాస’ అని నామకరణం చేయడమే కాకుండా హద్దులులేని అతి పెద్ద హిందూ దేశంగా దాన్ని అభివర్ణించాడు. అయితే తాజాగా నిత్యానంద ఆ ‘కైలాసం’ నుంచి కూడా పరారయ్యాడని ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. తాము నిత్యానందకు ఎలాంటి భూమి విక్రయించలేదని.. తమ ప్రభుత్వానికి, ఆయనకి మధ్య ఎలాంటి […]

  • Ravi Kiran
  • Publish Date - 8:52 am, Sat, 7 December 19
'కైలాసం' నుంచి నిత్యానంద పరార్.. మరో ద్వీపం కోసం..

అత్యాచారం, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద మత గురువు నిత్యానంద.. దేశం వదిలి పారిపోయి.. ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు దగ్గర్లో ఓ ద్వీపాన్ని కొన్న సంగతి తెలిసిందే. దానికి ‘కైలాస’ అని నామకరణం చేయడమే కాకుండా హద్దులులేని అతి పెద్ద హిందూ దేశంగా దాన్ని అభివర్ణించాడు. అయితే తాజాగా నిత్యానంద ఆ ‘కైలాసం’ నుంచి కూడా పరారయ్యాడని ఈక్వెడార్ ప్రభుత్వం ప్రకటించింది. తాము నిత్యానందకు ఎలాంటి భూమి విక్రయించలేదని.. తమ ప్రభుత్వానికి, ఆయనకి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఈక్వెడార్ ఎంబసీ ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ప్రస్తుతం నిత్యానంద ‘కైలాసం’ వదిలేసి హైతీ వెళ్లిపోయినట్లు ఈక్వెడార్ ప్రభుత్వం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే నిత్యానంద ‘కైలాసం’ గురించి గత కొద్దిరోజులుగా అనేక వార్తలు వచ్చాయి. ‘కైలాస’ దేశంగా నామకరణం చేసిన నిత్యానంద.. ఆ దేశానికి ఓ ప్రధానమంత్రిని, కేబినెట్‌ను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ‘కైలాస’ దేశానికి సొంతంగా పాస్‌పోర్టు.. జాతీయ జెండా, చిహ్నాలు సైతం ఉన్నాయట.

ఇకపోతే తాజాగా నిత్యానంద ఓ వీడియో ద్వారా పోలీసులకు గట్టి సవాల్ విసిరాడని చెప్పాలి. ‘తనను ఎవరూ పట్టుకోలేరని.. అంతేకాకుండా ఏ కోర్టు కూడా తనను విచారించలేదని అన్నాడు. అంతేకాకుండా అసలు నిజం ఏంటనేది మీ అందరికి త్వరలోనే చూపిస్తాను. నేను ఒక పరమశివుడిని.. ఎవ్వరికీ కూడా నన్ను ప్రశ్నించే హక్కు లేదని పేర్కొన్నాడు. కాగా, నవంబర్ 22న ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ కాగా.. అప్పటి నుంచి ఇది ట్రెండ్ అవుతూనే ఉంది.