‘నితీష్ నన్ను కొడుకులా చూసుకున్నారు.. కానీ’.. పీకే
రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా.. తన గురువు, బీహార్ సీఎం, జేడీ-యు అధినేత కూడా అయిన నితీష్ కుమార్ ని పొగిడినట్టే పొగిడి విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ రాజీ పడాలన్న నితీష్ ఐడియాలజీ ఏమిటో తనకు అర్థం కావడంలేదన్నారు. అసలు నితీష్ ఎన్డీయేలో కొనసాగవలసిన అవసరం లేదన్నారు. తనకు, ఆయనకు మధ్య పార్టీ సిధ్ధాంతాల గురించి ఎన్నోసార్లు చర్చలు జరిగాయని, గాంధీజీ సిధ్ధాంతాలను వదలబోనని […]
రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తాజాగా.. తన గురువు, బీహార్ సీఎం, జేడీ-యు అధినేత కూడా అయిన నితీష్ కుమార్ ని పొగిడినట్టే పొగిడి విమర్శనాస్త్రాలు కూడా సంధించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీతో పొత్తును కొనసాగిస్తూ రాజీ పడాలన్న నితీష్ ఐడియాలజీ ఏమిటో తనకు అర్థం కావడంలేదన్నారు. అసలు నితీష్ ఎన్డీయేలో కొనసాగవలసిన అవసరం లేదన్నారు. తనకు, ఆయనకు మధ్య పార్టీ సిధ్ధాంతాల గురించి ఎన్నోసార్లు చర్చలు జరిగాయని, గాంధీజీ సిధ్ధాంతాలను వదలబోనని నితీష్ చెప్పేవారని అన్నారు. కానీ ఇప్పుడు పార్టీ… గాంధీజీ హంతకుడైన నాథురాం గాడ్సే సానుభూతిపరులతో నిండిపోయిందని పీకే పేర్కొన్నారు. తనకు సంబంధించినంతవరకు గాంధీజీ, గాడ్సే వేరువేరని వ్యాఖ్యానించారు. ఇద్దరినీ ఒకే గాటన కట్టలేన్నారు. నన్ను నితీష్ కుమార్ కొడుకులా చూసుకున్నారు.. నేనూ ఆయనను తండ్రిలా భావిస్తూ వచ్చాను. నన్ను జేడీ-యు నుంచి బహిష్కరించారు. అయినా నేనేమీ బాధ పడడంలేదు అని ప్రశాంత్ కిషోర్ అన్నారు. జేడీయు ప్రభుత్వ పాలనలో బీహార్ బాగా వెనుకబడిపోయిందని ఆయన విమర్శించారు. ఏమైనా.. నితీష్ కుమార్ ని నేను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా అన్నారాయన..