COVID-19 news: భారత్‌లో కోవిడ్-19 కలకలం.. ఒకరు మృతి..?
COVID-19 news: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్-10 వైరస్.. భారత్‌లోనూ కలకలం రేపుతోంది. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడు కోవిడ్-19 లక్షణాలతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న చైనా నుంచి తమిళనాడులోని పుదుకొట్టైకి వచ్చిన శక్తి కుమార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 14న మధురైలోని ప్రభుత్వాసుపత్రిలో చేరిన శక్తి కుమార్.. ఆదివారం కన్నుమూశారు. చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులుకే అనారోగ్యానికి […]
COVID-19 news: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న మహమ్మారి కోవిడ్-10 వైరస్.. భారత్‌లోనూ కలకలం రేపుతోంది. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడు కోవిడ్-19 లక్షణాలతో మరణించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 4న చైనా నుంచి తమిళనాడులోని పుదుకొట్టైకి వచ్చిన శక్తి కుమార్ అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించారు. తీవ్ర అనారోగ్యంతో ఈ నెల 14న మధురైలోని ప్రభుత్వాసుపత్రిలో చేరిన శక్తి కుమార్.. ఆదివారం కన్నుమూశారు. చైనా నుంచి వచ్చిన కొన్ని రోజులుకే అనారోగ్యానికి గురి అవ్వడం, చికిత్స పొందుతూ చనిపోవడంతో ఇది కోవిడ్-19 కేసుగా డాక్టర్లు భావిస్తున్నారు.
మరోవైపు ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ -19 వైరస్ కలకలంతో పుదుకోట్టై, పరిసర గ్రామాల్లోకి ప్రత్యేక వైద్య బృందాలు తరలించారు. కాగా ఇప్పటి వరకు పుదుకోట్టై జిల్లాలో 115 మంది తమిళులు చైనా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా భారత్‌లో మొదటి కరోనా కేసు కేరళలో నమోదైంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు కేరళ వ్యక్తుల్లో కోవిడ్-19 లక్షణాలు కనిపించగా.. వారికి ప్రత్యేక చికిత్స అందించారు. ఆ తరువాత ఆ ముగ్గురు కోలుకోవడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ లోపే కోవిడ్-19 వైరస్ మృతి అంటూ న్యూస్ రావడంతో.. అందరిలో మళ్లీ అలజడి మొదలైంది.