పేదరికంతో పోరాడి.. జడ్జిగా ఎదిగి.. మహిళా ! నీకు నువ్వే సాటి !

పేదరికంతో ఆమె పోరాడింది. తినీ.. తినక.. ఫుట్ పాత్ లపైనే చదువుకుంటూ అక్కడే రాత్రుళ్ళు నిద్రిస్తూ వచ్చింది. మురికివాడల్లో జీవితం గడిపింది. కానీ ఆమె దృఢచిత్తం ముందు పేదరికం ఓడిపోయింది. ఆమె తెలివితేటల ముందు ఈ కష్టాలన్నీ తేలిపోయాయి. త్వరలో ఆమె జడ్జి కాబోతోంది. ఖరీదైన బంగళాలో ఉండబోతోంది. ఆమె పేరే రూబీ.. ఝార్ఖండ్.. పానిపట్ లోని అనాజ్ మండీలో స్లమ్ లో నివసిస్తూ వఛ్చిన ఈమె కష్టపడి చదివి గత మే నెలలో జరిగిన సివిల్ […]

పేదరికంతో పోరాడి.. జడ్జిగా ఎదిగి.. మహిళా ! నీకు నువ్వే సాటి !
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Feb 18, 2020 | 1:44 PM

పేదరికంతో ఆమె పోరాడింది. తినీ.. తినక.. ఫుట్ పాత్ లపైనే చదువుకుంటూ అక్కడే రాత్రుళ్ళు నిద్రిస్తూ వచ్చింది. మురికివాడల్లో జీవితం గడిపింది. కానీ ఆమె దృఢచిత్తం ముందు పేదరికం ఓడిపోయింది. ఆమె తెలివితేటల ముందు ఈ కష్టాలన్నీ తేలిపోయాయి. త్వరలో ఆమె జడ్జి కాబోతోంది. ఖరీదైన బంగళాలో ఉండబోతోంది. ఆమె పేరే రూబీ.. ఝార్ఖండ్.. పానిపట్ లోని అనాజ్ మండీలో స్లమ్ లో నివసిస్తూ వఛ్చిన ఈమె కష్టపడి చదివి గత మే నెలలో జరిగిన సివిల్ జడ్జి జూనియర్ పరీక్షల్లో 52 వ రాంక్ తెచ్చుకుని ఉత్తీర్ణురాలైంది. పేదరికం ఓ వైపు, తండ్రి మరణం మరోవైపు బాధించినప్పటికీ.. తల్లి జహీదా బేగం, సోదరుడు మహమ్మద్ రఫీ ఇఛ్చిన ప్రోత్సాహంతో.. ముందుకు కదిలింది రూబీ.. గత ఏప్రిల్ లో తన కుటుంబం ఉంటున్న గుడిసె అగ్నిప్రమాదంలో కాలిపోయింది. నిలువనీడలేక వీధులు, పేవ్ మెంట్లే వీరికి ఆవాసాలయ్యాయి. కానీ.. రూబీ గమ్యం సూటిగా సాగింది.  సివిల్ సర్వీసు పరీక్షల్లో పాస్ కావడంతో ఆమెకు, ఆమె కుటుంబ ఆనందానికి అవధుల్లేకపోయాయి.  రేపో మాపో ఝార్ఖండ్ రాజధాని చేరుకొని అక్కడి హైకోర్టులో న్యాయమూర్తి కూర్చునే కుర్చీలో కూచుండబోతున్న రూబీని పొగడనివాళ్ళు లేరు.