MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవితకు కాస్త ఊరట..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్ళై దర్యాప్తు అధికారుల ఎదుట ఇచ్చిన వాగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్ళై దర్యాప్తు అధికారుల ఎదుట ఇచ్చిన వాగ్మూలాన్ని ఆయన వెనక్కి తీసుకున్నారు. గతంలో ఆయన తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీ ఇంటూ ఈడీకి వాగ్మూలం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పెషల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి అనుమతించాలని ఢిల్లీ రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును కోరారు. కేసు విచారణకు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. పిళ్లై పిటిషన్‌పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడికి నోటీసులు జారీ చేసింది.
అరుణ్ రామచంద్ర పిళ్లై ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీలో ఉంటారు. కవితకు బినామీ అంటూ ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆయన వెనక్కితీసుకోవడం ఈ కేసులో పరిణామంగా మారింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు ఇది కాస్త ఊరట కలిగించే అంశం. ఈ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కవిత.. రేపు (మార్చి 11) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారు.
హస్తినలో కవిత దీక్ష..
ఇదిలా ఉండగా మహిళబిల్లు కోసం రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు MLC కవిత. ఈ ఏడాదే బిల్లుని పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేశారు. BJPకి పూర్తి మెజార్టీ ఉన్నా బిల్లుని ఇంతవరకు సభలో ఎందుకు ప్రవేశపెట్టలేదో చెప్పాలని నిలదీశారు. బిల్లుకు మద్దతుగా విపక్షాలను ఏకం చేసే బాధ్యతను తాము తీసుకుంటామని చెప్పారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరం అన్న కవిత చట్టసభల్లోనూ మహిళలకు సముచిత స్థానం దక్కాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత చేపట్టిన నిరాహార దీక్షకు వివిధ పార్టీల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. BRS మహిళా మంత్రులు, ఎంపీలు, పలువురు నేతలు కూడా పాల్గొన్నారు…
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ గతంలోనే స్పష్టమైన హామీ ఇచ్చారని CPM ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 9ఏళ్లు అవుతున్నా ఆ మాటను నిలుపుకోలేదని విమర్శించారు.. మహిళా బిల్లుపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని ప్రకటించారు.
మరిన్ని జాతీయ వార్తలు చదవండి..