Strain virus: భయపెడుతున్న కొత్త రకం స్ట్రైయిన్ వైరస్.. ల్యాబ్‌లలో మరిన్ని పరిశోధనలు
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు కొత్త రకం స్ట్రైయిన్ వైరస్ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఈ కొత్త స్ట్రైయిన్....
ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే.. మరో వైపు కొత్త రకం స్ట్రైయిన్ వైరస్ మరింత భయాందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్‌పై శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. అయితే ఈ కొత్త వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరు భౌతికంగా దూరంగా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
అయితే ‘501.వీ2’ అనే కొత్తరకం కరోనాను గుర్తించినట్లు ఇప్పటికే బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం రెండో వేవ్ వెనుకాల ఈ కొత్త రకం వైరస్ ఉందనేందుకు బలమైన ఆధారాలను గుర్తించారు నిపుణులు. అయితే ముందున్న వైరస్‌కంటే ఇది చాలా ప్రమాదకరమైనదా..? లేదా, లేకపోతే కోలుకున్న తర్వాత మళ్లీ సోకుతుందా ..? అనే దానికి సమాధానం పరిశోధనలు జరుగుతున్నాయి.
కొత్త రకం వైరస్‌పై పరిశోధనలు
కాగా, కొత్త రకం కరోనా వైరస్ బయటపడటంతో ల్యాబ్‌లలో పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ స్ట్రైయిన్‌ను ల్యాబ్‌లో పెంచుతూ, కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించిన సీరమ్‌ను దీనిపై ప్రయోగించి వైరస్ నిర్వీర్యం అవుతుందో లేదో పరిశీలిస్తున్నారు. తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఈ కొత్త రకం వైరస్ మునుపటికంటే ప్రమాదకరమా..? కాదా అని తేల్చే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు.
అప్రమత్తంగానే ఉండాలి..
అయితే ఈ కొత్త రకం స్ట్రైయిన్ వైరస్‌పై ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని సూచిస్తున్నారు. ఈ వైరస్‌పై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయని, అయినా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగానే ఉండాలంటున్నారు. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల ఎంతో నష్టం వాటిల్లింది. ఈ వైరస్ కారణంగా రోజురోజుకు కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయని, అందుకే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
మరో వైపు బ్రిటన్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ కొత్త రకం స్ట్రైయిన్‌తో వస్తుందన్న వార్తలతో తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్రం సూచనల మేరకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వైద్య ఆరోగ్యశాఖ విదేశీ ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పని సరి చేసింది. పాజిటివ్ వచ్చిన వారిని కోవిడ్ ఆస్పత్రులకు తరలించాలని సూచించింది. అలాగే నెగిటివ్ వచ్చినవారిని 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉంచాలని, ఎయిర్ పోర్టుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. విదేశాల నుంచి ఇప్పటికే రాష్ట్రాలకు వచ్చిన వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అధికారులు.