AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day 2022: మహిళలకు సమాన హక్కులపై పురుషుల మాట ఇది.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి

International Women's Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8'వ తేదీ మంగళవారం రోజున జరుపుకోనున్నాము. ఈ నేపథ్యంలో భారతీయ పురుషులు.. ముఖ్యంగా భర్తలు తమ భార్యల విషయంలో..

Women's Day 2022: మహిళలకు సమాన హక్కులపై పురుషుల మాట ఇది.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి
Pew Study
Surya Kala
|

Updated on: Mar 05, 2022 | 12:19 PM

Share

International Women’s Day 2022: అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8’వ తేదీ మంగళవారం రోజున జరుపుకోనున్నాము. ఈ నేపథ్యంలో భారతీయ పురుషులు.. ముఖ్యంగా భర్తలు తమ భార్యల విషయంలో ఏ విధంగా ఆలోచిస్తారనే విషయంపై ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతీయుల్లో(Indians) దాదాపు  87 శాతం మంది పురుషులు ..  “భార్య ఎప్పుడూ తన భర్తకు కట్టుబడి ఉండాలి” అనే భావనతో ఉన్నారని “ప్యూ స్టడీ సెంటర్”(Pew study Center) తెలిపింది. ఆడవారు అన్ని విషయాల్లోనూ ముందుకు వెళ్లాలి.. అయితే తన భార్య మాత్రం తమకు అనుకులంగా .. తమ మాట వింటూ జీవించాలని చెప్పారు. అయితే మహిళకు సమాజంలో పురుషులతో పాటు సమానమైన హక్కులను కలిగి ఉండాలని.. అటువంటి మహిళలకు తాము సపోర్ట్ చేస్తామని..  అయితే అదే సమయంలో పురుషులకు ప్రాధాన్యత ఇవ్వాలని భారతీయులు భావించారు.” అని నివేదిక(Report) పేర్కొంది. కొన్ని ఉద్యోగాలలో స్త్రీల కంటే పురుషులకు ఎక్కువ హక్కులు ఉండాలనే అనే ఆలోచనతో 80 శాతం మంది అంగీకరించారని అమెరికన్ పరిశోధకులు ఇటీవల చేసిన అధ్యయనంలో వెల్లడైంది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ బుధవారం విడుదల చేసిన కొత్త నివేదికలో భారతీయులు ఇంట్లో, సమాజంలో మహిళలను ఎలా చూస్తారు.. COVID-19 మహమ్మారికి ముందు, 2019 చివరిలో..  2020 ప్రారంభంలో 29,999 మంది భారతీయులను  ముఖాముఖి సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. అంతేకాదు భారతదేశంలోని మతంపై 2021లో చేసిన సర్వే ఆధారంగా ఓ నివేదికలను రూపొందించారు.  ఈ సర్వేను 17 భాషల్లో భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు(States), కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించారు.

“భారతీయులు దాదాపుగా విశ్వవ్యాప్తంగా స్త్రీలకు పురుషులతో సమానమైన హక్కులను కలిగి ఉండటం చాలా ముఖ్యమని చెప్పారు. అయితే అదే సమయంలో.. స్త్రీలు ఎక్కువుగా పురుషులకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారని నివేదిక పేర్కొంది.  పది మందిలో తొమ్మది మంది భారతీయులు తమ భార్య తమ తమకు ప్రాధాన్యత ఇవ్వాలని.. తమకు కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు. ఈ సెంటిమెంట్ ను అత్యధిక భారతీయులు అంగీకరిస్తున్నారు.

అయితే, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సహా భారత రాజకీయాల్లో కీలకమైన మహిళా రాజకీయ ప్రముఖులను ప్రస్తావిస్తూ.. మహిళలు రాజకీయాల్లో  రాణించడాన్ని భారతీయులు అంగీకరిస్తారని నివేదిక పేర్కొంది.  ఈ సర్వే ఫలితాలు రాజకీయాల్లో మహిళలకు ఉన్న అవకాశాలను తెలుపుతున్నాయి. స్త్రీలు ..  పురుషులు సమానంగా మంచి రాజకీయ నాయకులుగా ఎదగడాన్ని హర్షిస్తారని  55%  మంది చెప్పారు.  స్త్రీలు,  పురుషుల కంటే మంచి నాయకులని 14%  మంది చెప్పారు.  పురుషులు మహిళల కంటే మెరుగైన రాజకీయ నాయకులు చేస్తారని కేవలం నాలుగింట ఒక వంతు మంత్రమే చెప్పారని అధ్యయనం పేర్కొంది.

చాలా మంది భారతీయ పురుషులు..  మహిళలు కుటుంబ బాధ్యతలను పంచుకోవాలని చెబుతున్నప్పటికీ.. ఎక్కువ మంది సాంప్రదాయంగా మహిళలు ఉండాలని కోరుకుంటున్నారని నివేదికలో వెల్లడైంది.

పిల్లల విషయానికి వస్తే.. ఒక కుటుంబంలో కొడుకు ఉండాలని 94%  మంది కోరుకుంటే..  ఒక కుమార్తె  కలిగి ఉండటం చాలా ముఖ్యం అని 90% మంది కోరుకుంటున్నారు. మొత్తానికి కుటుంబంలో కొడుకు కూతురు ఉండాలని భావిస్తున్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది.

చాలా మంది భారతీయులు సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రుల అంత్యక్రియలు నిర్వహించాలని చెప్పారు. ముస్లింలు (74%), జైనులు (67%) , హిందువులు (63%) అంత్యక్రియలను సంప్రదాయాలను అనుసరించి కుమారులు బాధ్యత వహించాలని చెప్పారు. అయితే సిక్కులు (29%), క్రైస్తవులు (44%) ,  బౌద్ధులు (46%) తల్లిదండ్రులు కొడుకుల నుండి  అంత్యక్రియలను ఆశిస్తూనే కుమార్తె కూడా భాద్యత వహించాలని కోరుతున్నారు. ముస్లింల్లో అత్యధిక మంది కుమార్తెలు తమ సంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలని కోరుతుంటే.. సిక్కులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

Viral Video: శివలింగం దగ్గరకు వచ్చిన నాగుపాము.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..