Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లోయలో పడి ఐదుగురు దుర్మరణం..
Samba Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం లోయలో పడిన ఘటనలో ఐదుగురు
Samba Road Accident: జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం లోయలో పడిన ఘటనలో ఐదుగురు మరణించారు. ఈ దుర్ఘటన కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఘాట్ రోడ్డులో ప్రయాణికులతో వెళ్తున్న ఎస్‌యూవీ వాహనం అదుపు తప్పి లోతైన లోయలో (Gorge) పడిపోయింది. దీంతో అక్కడికక్కడే ఐదుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌యూవీ వాహనం పంజాబ్నుంచి శ్రీనగర్ వెళ్తుండగా మాన్సార్సమీపంలోని జమోదా ప్రాంతంలో లోయలో పడిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
J&K | A total of five people died and one was injured in an accident near the Mansar area of Samba district early in the morning, the station house officer (SHO) of Samba said
— ANI (@ANI) March 5, 2022
ఇదిలా ఉండగా.. పంత్యాల్ వద్ద కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు నిలిపివేసినట్లు అధికారులు శనివారం తెలిపారు. క్లియరెన్స్ పనులు పూర్తయ్యే వరకు రహదారిని మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: