AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navy Day 2024: ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే.. రిహార్సల్స్‌‌లో అదరహో అనిపించిన మన నౌకా దళం

సముద్రంలో సరి రారు మాకెవ్వరూ అంటూ గర్జిస్తోంది ఇండియన్‌ నేవీ. సాగర తీరంలో సాహస విన్యాసాలతో అదరగొట్టింది మన నౌకా దళం. పూరీ తీరంలో జరిగిన నేవీ డే రిహార్సల్స్‌ నెక్ట్స్‌ లెవెల్‌ అనిపిస్తున్నారు. డిసెంబర్ 4 వ తేదీన జరగనున్న నేవీ డే పై ఈ రిహాల్సాస్ మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. 

Navy Day 2024: ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే..  రిహార్సల్స్‌‌లో అదరహో అనిపించిన మన నౌకా దళం
Navy Day 2024
Surya Kala
|

Updated on: Dec 02, 2024 | 7:27 AM

Share

నిప్పులు కక్కుతూ శత్రుమూకలపై విరుచుకుపడ్డ హెలికాప్టర్లు.. నేవీ కమెండోల సాహసోపేత విన్యాసాలు..    శత్రువుల గుండెల్లో గర్జించిన యుద్ధ విమానాలు. సాగర తీరంలో కదం తొక్కిన యుద్ధ ట్యాంకులతో మన దేశ  నౌకా దళ విన్యాసాలు నెక్ట్స్‌ లెవెల్‌ అనిపిస్తున్నాయి చూపరులకు. వారెవ్వా మన నేవీ కమెండోల స్వాగ్‌ చూడండి. ఖతర్నాక్‌ లుక్‌తో వాళ్లొస్తుంటే…దుష్మన్ల గుండెల్లో దడ పుట్టాల్సిందే. ఈ సన్స్‌ ఆఫ్‌ గన్స్‌…తుపాకులను తిప్పుతుంటే కళ్లు చెదిరిపోవాల్సిందే అనక మానరు మన నేవీ దళం చేసిన విన్యాసాలు చూసిన ఎవరైనా..

ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే

సముద్రంలో సరి లేరు మాకెవ్వరూ అంటూ దూసుకుపోయాయి యుద్ధ నౌకలు, జలాంతర్గరాములు. యుద్ధ నౌకలు, విమానాల నుంచి దూసుకెళ్లాయి మిస్సైల్స్‌. ఈ నెల 4న పూరీ తీరంలో నేవీ డే జరపనుంది మన నావికా దళం. దానికోసమే ఈ రిహార్సల్స్‌ నిర్వహించారు.

 విన్యాసాలతో…వేవ్స్ ఆఫ్‌ పవర్‌ ఎట్లా ఉంటుందో చూపించింది నౌకా దళం

ఒడిశాలోని పూరీ తీరంలో.. మరో రెండు రోజుల్లో జరగనున్న నేవీ డేలో ఆపరేషన్‌ డెమాన్‌స్ట్రేషన్‌ కోసం రకరకాల సన్నాహాక విన్యాసాలు చేసింది మన నౌకాదళం. నేవీ హెలికాప్టర్లు, ఫైటర్ జెట్లు, పెట్రోలింగ్ విమానాలు, యుద్ధ నౌకల విన్యాసాలు, మాక్‌ రెస్క్యూలు అదరహో అనే లెవెల్లో జరిగాయి. ఇండియన్‌ నేవీ బలం, బలగం, సముద్రంలో శత్రువులను మట్టి కరిపించే సత్తాను… ఈ రిహార్సల్స్‌ టీజర్‌లో చూపించింది. ట్రైలర్ ఇట్లా ఉంటే…ఇక ఈ నెల 4 తేదీన జరగనున్న ఫుల్‌ పిక్చర్‌ వైల్డ్‌ ఫైరే!

 1971 వార్‌లో నేవీ కీలక పాత్ర

ఈ నేవీ రిహార్సల్స్‌లో ఢిల్లీ క్లాస్ డిస్ట్రాయర్లు, శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్‌లు, కమోర్టా క్లాస్ షిప్పులు, నేవల్ ఆఫ్‌షోర్ పెట్రోల్ వెస్సెల్స్, హెచ్‌ఏఎల్‌ తయారు చేసిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను మట్టి కరిపించింది మన దేశం. ఆ సమరంలో…’ఆపరేషన్ ట్రైడెంట్’ పేరుతో భారత నేవీ కీలక పాత్రను పోషించింది. ఆ యుద్ధంలో మన నౌకా దళం సాధించిన విజయాలను స్మరించుకోవడానికి ప్రతి ఏటా డిసెంబర్‌ 4న నేవీ డే జరుపుతారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..