CAT 2024 Result Date: క్యాట్ 2024 ‘కీ’ విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?

ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) విద్యా సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు నిర్వహించిన క్యాట్ 2024 పరీక్ష ఫలితాలు త్వరలోనే విడుదలకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఆన్సర్ కీ విడుదల తేదీ తాజాగా జారీ అయ్యింది..

CAT 2024 Result Date: క్యాట్ 2024 'కీ' విడుదల తేదీ వచ్చేసింది.. ఫలితాలు ఎప్పుడంటే..?
CAT 2024 Answer Key
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 02, 2024 | 7:06 AM

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2: దేశంలోని ప్రతిష్ఠాత్మక ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష- కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(క్యాట్‌) 2024.. నవంబర్‌ 24న దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశంలో మొత్తం 170 న‌గ‌రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ ఆధారిత విధానంలో జరిగిన ఈ పరీక్ష ఆన్సర్‌ కీ డిసెంబర్‌ 3న విడుదలకానుంది. అభ్యంతరాలు డిసెంబర్‌ 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాల్సి ఉంటుంది. డిసెంబర్‌ నెలాఖరు లేదా వచ్చే ఏడాది జనవరి రెండో వారంలో ఫలితాలు విడుదలయ్యే అవకాశముంది. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్‌ ఆధారంగా ఐఐఎంలలో సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్‌ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న ఇతర కాలేజీల్లో కూడా ప్రవేశాలు పొందవచ్చు. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదల.. డిసెంబర్‌ 10, 11 తేదీల్లో పరీక్షలు

దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి (గ్రూప్ బి, నాన్ గెజిటెడ్‌), స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి (గ్రూప్ సి) పోస్టుల భర్తీకి సంబంధించి ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది గత జులై నెలలో ఎస్‌ఎస్‌సీ ఈ ప్రకటన జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మొత్తం 2,006 కొలువులను భర్తీ చేయనున్నారు. తాజాగా నియామక రాత పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను కమిషన్‌ విడుదల చేసింది. ఇందులో పరీక్ష కేంద్రం, పరీక్ష తేదీ వివరాలు ఉంటాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్ వివరాలు నమోదు చేసి సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డిసెంబర్‌ 5న పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులు విడుదల కానున్నాయి. ఇక డిసెంబర్‌ 10, 11 తేదీల్లో దేశ వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్టెనోగ్రఫీలో స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర