Holistic Cards: బడుల్లో ఇక ప్రోగ్రెస్‌ కార్డులు ఉండవ్‌.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం

ప్రభుత్వ బడుల్లో విద్యార్ధులకు ఇకపై ప్రొగ్రెస్ కార్డులు కనిపించవు. వీటి స్థానంలో సరికొత్త కార్డులు తీసుకువచ్చేందుకు కూటమి సర్కార్ సన్నద్ధమవుతుంది.ఇందులో విద్యార్ధులు హాజరు, మార్కులే కాదు ఎన్నో విషయాలను పొందుపరచనున్నారు..

Holistic Cards: బడుల్లో ఇక ప్రోగ్రెస్‌ కార్డులు ఉండవ్‌.. కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం
Holistic Cards
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 01, 2024 | 8:16 AM

అమరావతి, డిసెంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో కూటమి సర్కార్ సరికొత్త సంస్కరణలకు నడుం బిగిస్తుంది. విద్యార్థులకు ప్రోగ్రెస్‌ కార్డులకు బదులు హోలిస్టిక్‌ కార్డులు (సమగ్ర ప్రగతి పత్రాలు) ఇవ్వాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రతి తరగతికి ప్రోగ్రెస్‌ కార్డులు ఇచ్చేవారు. వీటిల్లో విద్యార్ధుల హాజరు, పరీక్షల్లో వారు సాధించిన మార్కులను పొందుపరిచే వారు. కానీ వీటి స్థానంలో కొన్ని మార్పులు చేసి హోలిస్టిక్‌ కార్డులను రూపొందించారు. వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వనున్నారు.

హోలిస్టిక్‌ కార్డులు లోపల పేజీలో క్యూఆర్‌ కోడ్‌ను పొందుపరిచారు. ఫోన్‌ ద్వారా దీన్ని స్కాన్‌ చేసి.. విద్యార్థి అభ్యసన సవాళ్లను గుర్తించడానికి వీలుగా ఇది ఉపయోగపడుతుంది. అలాగే విద్యార్థి అభిరుచులు, ఆసక్తులు, విద్యాపరమైన సామర్థ్యాలు, సవాళ్లను ప్రతి 6 నెలలకోసారి ఇందులో నమోదు చేస్తారు. విద్యార్థి బ్లడ్‌ గ్రూప్, ఎత్తు, బరువు, బీఎంఐ వంటి తదితర అంశాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. హోలిస్టిక్‌ కార్డుల ద్వారా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చని విద్యాధికారులు చెబుతున్నారు.

తెలంగాణ ఎంఈడీ, ఎంపీఈడీ తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదే.. డిసెంబర్‌ 5న సీట్ల కేటాయింపు

తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాల తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ జారీ అయ్యింది. ఇప్పటికే ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. డిసెంబర్ 2వ తేదీతో రిజిస్ట్రేషన్‌ గడువు పూర్తవుతుంది. డిసెంబర్ 3న రిజిస్ట్రేషన్‌లో మార్పులు చేసుకోవడానికి అవకాశం ఇస్తారు. డిసెంబర్ 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. డిసెంబర్ 5వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీలోగా ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తుది విడత కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.