National Herald case: రాహుల్ గాంధీ విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ.. నేటి విచారణ వాయిదా..
National Herald case: రాహుల్‌గాంధీ విజ్ఞప్తికి అంగీకరించింది ఈడీ. ఇవాళ్టి విచారణను వాయిదా వేయాలని కోరారు రాహుల్‌గాంధీ. సోనియా ఆసుపత్రిలో ఉన్నారని..
National Herald case: రాహుల్‌గాంధీ విజ్ఞప్తికి అంగీకరించింది ఈడీ. ఇవాళ్టి విచారణను వాయిదా వేయాలని కోరారు రాహుల్‌గాంధీ. సోనియా ఆసుపత్రిలో ఉన్నారని ఈడీకి తెలిపారు రాహుల్ గాంధీ. తిరిగి సోమవారం విచారణకు హాజరవుతానని తెలిపారు. రాహుల్‌గాంధీ విజ్ఞప్తిని అంగీకరించింది ఈడీ. దీంతో ఇవాళ్టికి బదులుగా సోమవారం రాహుల్‌గాంధీ విచారణకు హాజరవుతారు. ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసులో మూడు రోజుల పాటు రాహుల్‌గాంధీని విచారించారు ఈడీ అధికారులు. సోమవారం మరోసారి విచారించనున్నారు.
మరోవైపు రాహుల్‌గాంధీ ఈడీ విచారణకు నిరసనగా దేశవ్యాప్తంగా నిన్న కాంగ్రెస్ నేతలు తమ ఆందోళనలు ఉధృతం చేశారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనలు చేపట్టాయి కాంగ్రెస్ శ్రేణులు. అన్ని రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌ను ముట్టడించారు. చండీఘడ్‌లో కాంగ్రెస్ కార్యకర్తల రాజ్‌భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు పోలీసులు. వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పలువురు పంజాబ్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్ముకశ్మీర్‌లో కూడా కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలు మిన్నంటాయి. బీజేపీ భయంతో రాహుల్‌గాంధీని టార్గెట్ చేసిందని కాంగ్రెస్ నిరసనలు చేపట్టారు.