PM Modi: ‘తెలంగాణకు వ్యతిరేకం కాదు కానీ..’ ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజ్యసభలో...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజించిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ రాజ్యసభలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల విభజనపై మాట్లాడిన మోడీ.. కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఉమ్మడి ఏపీకి కాంగ్రెస్ అన్యాయం చేసిందంటూ విమర్శలు గుప్పించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య విభజన సామరస్య పద్దతిలో జరగాల్సిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ హడావుడిగా విభజన బిల్లును ఆమోదించిందని ప్రధాని మోడీ అన్నారు. విభజన చట్టంపై కాంగ్రెస్ ఎలాంటి చర్చ జరపలేదు. మైకులు కట్ చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య పద్దతి.? అంటూ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.
ఎలాంటి వివాదాలు లేకుండా అటల్ బిహారీ వాజ్‌పేయి మూడు రాష్ట్రాలను శాంతియుతంగా ఏర్పాటు చేశారని మోడీ గుర్తు చేశారు. ఎలాంటి వివాదం తలెత్తకుండా.. అందరూ కలిసి కూర్చుని బిల్లును పాస్ చేశారన్నారు. ఏపీ తెలంగాణ విషయంలోనూ ఇలా జరిగి ఉంటే బాగుండేదని ప్రధాని మోడీ తెలిపారు. రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదన్న మోడీ.. కాంగ్రెస్ అధికార గర్వం వల్ల ఇరు రాష్ట్రాలు ఇంకా సమస్యలు ఎదుర్కుంటున్నాయని అన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య వైషమ్యాలకు కాంగ్రెస్సే కారణం అని తెలిపారు. తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మలేదు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి సైతం ఎలాంటి లాభం జరగలేదు.
Also Read:
Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుందా.? ఈజీగా కనిపెట్టచ్చండోయ్.! కష్టం కాదు..