‘నా ఫోన్ కూడా హ్యాక్ అయింది.. పరిస్థితి చాలా సీరియస్’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన
పెగాసస్ వివాదంపై బుధవారం ఉదయం విపక్ష నేతల సమావేశంలో పాల్గొనలేకపోయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ..
పెగాసస్ వివాదంపై బుధవారం ఉదయం విపక్ష నేతల సమావేశంలో పాల్గొనలేకపోయిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. ఈ వివాదం(పెగాసస్) చాలా సీరియస్ అని వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా హ్యాక్ అయిందని, ఇది ఎమర్జెన్సీ కన్నా చాలా తీవ్రమైన విషయమని ఆమె అన్నారు. ఇది హైలోడ్ గల వైరస్ అని, మన భద్రత, రక్షణ ప్రమాదంలో ఉన్నాయని ఆమె చెప్పారు. ఎవరికీ స్వేచ్ఛ లేదని, తన ఫోనే కాకుండా అభిషేక్ బెనర్జీ, ప్రశాంత్ కిషోర్ సహా పలువురి ఫోన్లు ఇదివరకే హ్యాకింగ్ కి గురయ్యాయని ఆమె పేర్కొన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపాలని, ఆ కోర్టుపై తమకు విశ్వాసం ఉందని అన్నారు. ఇక ప్రతిపక్షాల ఐక్యత గురించి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె.. విపక్షాలు ఒక్క తాటిపైకి రావలసిన సమయం ఆసన్నమైందన్నారు. మీరు ఇందుకు నేతృత్రం వహిస్తారా అని అడగ్గా ..ఏ ప్రతిపక్ష నేత అయినా వహించవచ్చునని, అందరినీ తాను కలుపుకుని పోతానని చెప్పారు. ఎవరు దీన్ని ముందుండి నడిపిస్తారని ప్రశ్నించగా తానేమీ రాజకీయ జ్యోతిష్కురాలిని కానన్నారు.. ముందు ముందు మీరే చూడడండని వ్యాఖ్యానించారు.
తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని, ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తో కూడా భేటీ అవుతానని మమతా బెనర్జీ తెలిపారు. నిన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసినట్టు వెల్లడించారు. నాన్-బీజేపీ రాష్ట్రాల సీఎంలను కూడా కలిసే యోచన కూడా ఉందని, వారందరితో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. మరికొందరు విపక్ష నేతలను త్వరలో కలుస్తానని ఆమె చెప్పారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Mamatha Banerjee: ఢిల్లీ పర్యటనలో దీదీ బిజీబిజీ.. అన్ని పార్టీల నేతలతో వరుస భేటీ.. మమతా హస్తిన టూర్ ఆంతర్యం ఇదేనా..?
Viral Video: ఇదేందయ్యా ఇది.! నూడిల్స్‌ను ఇలా కూడా చేస్తారా.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు.!