My India My Life Goals: యూ ఆర్ గ్రేట్ కానరామ్ మేవాడ.. ప్లాస్టిక్ వ్యర్థాలకు రీసైక్లింగ్‌తో చెక్..
Kana Ram Mewada - Inspirational Story: పర్యావరణ పరిరక్షణ అంటే అతనికి ప్రాణం.. అందుకే.. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వ్యర్థాలపై ఆయన దండేత్తారు.. దీనిలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సేకరిస్తుంటారు..
Kana Ram Mewada – Inspirational Story: పర్యావరణ పరిరక్షణ అంటే అతనికి ప్రాణం.. అందుకే.. పర్యావరణానికి హానిచేసే ప్లాస్టిక్ వ్యర్థాలపై ఆయన దండేత్తారు.. దీనిలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను సేకరిస్తుంటారు.. ఇలా ప్రతినెలా ఆయన 200 కేజీల ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేస్తుంటారు.. అందుకే ఆయన ప్రేమికుడై.. అందరికీ ఆదర్శవంతంగా మారారు.. ఆ గ్రీన్ వారియర్ ఎవరో కాదు.. కానారాం మేవాడ.. యూపీకి చెందిన కనారామ్ మేవాడా అనే టీ స్టాల్ యజమాని. ఆయన పర్యావరణ పరిరక్షణకు కొన్నేళ్ల క్రితం నడుంబిగించారు. దీనిలో భాగంగా ఆయన తన గ్రామం.. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తుంటారు. తన గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే ప్రయత్నంలో భాగంగా కిలోల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేయడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. టీ స్టాల్ నిర్వహిస్తూనే ప్లాస్టిక్ రహిత గ్రామం కోసం వినూత్నమైన ఆలోయనలతో ముందుకెళ్తారు. కేజీ ప్లాస్టిక్ సేకరించి ఇచ్చిన వారికి బహుమతులు అందజేస్తారు. గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటికెళ్లి వాటర్ బాటిళ్లు, పాల ప్యాకెట్లు, చిప్స్ కవర్లు, క్యారీ బ్యాగులు ఇలా వీటన్నింటినీ సేకరించడం మొదలుపెట్టారు. ఇంకా ప్లాస్టిక్ ను తన దుకాణానికి తెచ్చిన వారికి ప్రత్యేక బహుమతులిస్తామంటూ ప్రకటించారు. ఇలా గ్రామస్తులు తీసుకువచ్చే వ్యర్థాలకు బదులుగా తాను ఏదైనా ఇవ్వడం ప్రారంభించాననని.. చెప్పారు. దుకాణం నుండి ఏదైనా వస్తువు ఇవ్వడం లేదా చక్కెర లేదా మొక్క వంటి వాటిని ఇస్తానని కానరామ్ పేర్కొన్నారు. ఇలా నెల మొత్తంలో సేకరించిన ప్లాస్టిక్‌ను ప్రాసెసింగ్ కోసం సమీపంలోని నగరంలోని రీసైక్లింగ్ కంపెనీకి తీసుకువెళతారు.
ఇలా కనరామ్ ఎన్జీవో ద్వారానే కంపెనీకి కనెక్ట్ అయ్యారు. దుకాణం పక్కనే ఉన్న గదిలో వ్యర్థాలను భద్రపరుస్తారు. ఇలా ఇరుగుపొరుగు గ్రామాలలో కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి, మొత్తం ప్రాంతాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. “నాలాంటి ఒక సాధారణ వ్యక్తి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నప్పుడు, మొత్తం గ్రామం మొత్తం మద్దతునిచ్చింది. భవిష్యత్తు కోసం మనమందరం టార్చ్ బేరర్లు కావచ్చు. మనం చేయాల్సిందల్లా ఒక అడుగు ముందుకు వేయడమే.’’ అంటూ కానరామ్ పేర్కొన్నారు.
ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. మై ఇండియా – మై లైఫ్ గోల్స్ పేరుతో.. లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ మూవ్‌మెంట్ నినాదంతో చేపట్టిన ఈ ఉద్యమంలో టీవీ9 నెట్‌వర్క్ కూడా భాగస్వామిగా ఉంది. రండి.. ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం.. ఈ దేశాన్ని స్వచ్ఛంగా, మరింత సుందరగా మారుద్దాం..
మరిన్ని జాతీయ వార్తల కోసం..