AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KCR – Akhilesh: ప్లాను మారింది.. స్కెచ్చు మారింది..! సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ అందుకేనా..?

CM KCR - Akhilesh Yadav: నేషనల్ పాలిటిక్స్ కేరాఫ్ ప్రగతి భవన్. అవును ఈసారి వేదిక మారింది. మొన్న పాట్నాలో మోడీ ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నీ సమాలోచనలు చేశాయి. ఆ తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా పరిణామాలు జరిగాయి.

KCR - Akhilesh: ప్లాను మారింది.. స్కెచ్చు మారింది..! సీఎం కేసీఆర్‌తో అఖిలేష్‌ భేటీ అందుకేనా..?
Kcr Akhilesh
Shaik Madar Saheb
|

Updated on: Jul 03, 2023 | 7:13 PM

Share

CM KCR – Akhilesh Yadav: నేషనల్ పాలిటిక్స్ కేరాఫ్ ప్రగతి భవన్. అవును ఈసారి వేదిక మారింది. మొన్న పాట్నాలో మోడీ ప్రభుత్వ వ్యతిరేక పార్టీలన్నీ సమాలోచనలు చేశాయి. ఆ తర్వాత జాతీయ స్థాయి రాజకీయాల్లో చాలా పరిణామాలు జరిగాయి. లేటెస్ట్‌గా సౌత్‌ మీద ఫోకస్ పెట్టిన.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్.. కేసీఆర్‌తో ములాఖత్ అయ్యారు. బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా కేసీఆర్‌తో కలిసి నడుస్తామంటున్నారు అఖిలేష్‌. హైదరాబాద్‌ వచ్చి ప్రగతిభవన్‌లో గులాబీ బాస్‌తో స్పెషల్‌గా భేటీ అయ్యారు. లంచ్ మీటింగ్ లో ఇద్దరూ తాజా రాజకీయ పరిస్థితులపై చాలాసేపు చర్చించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉత్తరాదిలో పావులు కదుపుతున్న అఖిలేష్, కేసీఆర్‌ని కలవడం ఆసక్తికరంగా మారింది.

ఆల్రెడీ దక్షిణాదిలో బీజేపీకి వ్యతిరేకంగా వాయిస్ పెంచిన కేసీఆర్.. ఇంతకుముందు కూడా అఖిలేష్‌తో సమావేశమయ్యారు. తాజా భేటీ తర్వాత వీళ్లిద్దరి మధ్య ఏదైనా డీల్ కుదరొచ్చని.. మోదీ టార్గెట్‌గా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవచ్చని తెలుస్తోంది.అంతకుముందు మాట్లాడిన అఖిలేష్ యాదవ్.. బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలు కూడా తమకు మిత్రులే అని అంటూ పేర్కొన్నారు. కేసీఆర్‌ కూడా బీజేపీపై పోరాడుతున్నారని , అందరం కలిసి బీజేపీని గద్దె దింపుతామని అఖిలేశ్‌ యాదవ్ పేర్కొన్నారు.

అయితే, సీఎం కేసీఆర్, అభిలేష్ యాదవ్ మీటింగ్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. పాట్నా వేదికగా జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో పాల్గొన్న అఖిలేష్ తాజాగా.. కేసీఆర్ ను కలవడం రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ సమావేశంతో అఖిలేష్.. కాంగ్రెస్‌తో కటీఫ్ చెప్పి కేసీఆర్‌తో కలుస్తామంటున్నారా? లేక పాట్నా మీటింగ్‌లో చర్చ సారాంశాన్ని కేసీఆర్‌కి చెబుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అంతేకాకుండా.. ఇద్దరి కలయికతో సరికొత్త అజెండా ఏర్పొడొచ్చన్న అంచనాలు కూడా మొదలయ్యాయి.

ఇవి కూడా చదవండి

మొన్ననే కాంగ్రెస్‌తో సై అన్న అఖిలేష్.. ఇప్పుడు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.ఏదైనా ప్లాన్ ఉందా..? లేక క్యాజువల్ గా కలిశారా అనేది.. ఇంకా తెలియాల్సి ఉంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం..

వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్.. ఇకపై షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌?
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..