AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

lone passenger in flight : ఆ విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు, చప్పట్లు కొట్టి అతడ్ని సాదరంగా ఆహ్వానించిన సిబ్బంది, ఎక్కడంటే ..?

ముంబై నుంచి దుబాయ్ కి ప్రయాణించిన విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నాడంటే నమ్మలేం..కానీ ఇది నిజం.. బుధవారం 360 మంది ప్రయాణికులతో ముంబై నుంచి అక్కడికి వెళ్లాల్సిన ప్లేన్ జస్ట్..

lone passenger in flight : ఆ విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు, చప్పట్లు కొట్టి అతడ్ని సాదరంగా ఆహ్వానించిన సిబ్బంది,  ఎక్కడంటే ..?
Mumbai To Dubai Flight Operates With Just One Passenger On Board
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: May 26, 2021 | 7:48 PM

Share

ముంబై నుంచి దుబాయ్ కి ప్రయాణించిన విమానంలో ఒకే ఒక్క ప్రయాణికుడు ఉన్నాడంటే నమ్మలేం..కానీ ఇది నిజం.. బుధవారం 360 మంది ప్రయాణికులతో ముంబై నుంచి అక్కడికి వెళ్లాల్సిన ప్లేన్ జస్ట్.. ఈ ఒక్క ప్రయాణికుడితో బయల్దేరింది. దుబాయ్ వెళ్లాల్సిన వారిలో చాలామంది తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమో, లేదా సెకండ్ కోవిద్ వేవ్ కారణంగా రద్దు చేసుకుని ఉండడమో ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా భవేష్ జవేరి అనే ఒక్క ట్రావెలర్ మాత్రం తానొక్కడే విమానం ఎక్కాడు. ఆయన ఎంటర్ కాగానే పైలట్ సహా ఇతర సిబ్బంది చప్పట్లతో అతనికి సాదరంగా స్వాగతం పలికారు. తాను సాధారణ వ్యక్తినని, వీడియోలు తీసుకునేవాడిని కానని, కానీ ఈ రోజు స్పెషల్ గా భావిస్తున్నానని ఆయన చెప్పాడు. ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ప్రయాణికుడిని తానొక్కడినే అని, భలే ఎగ్జైటింగ్ గా ఉందని పేర్కొన్నాడు. సెక్యూరిటీ సిబ్బంది మినహా ఖాళీగా ఉన్న ముంబై విమానాశ్రయాన్ని ఆయన తన మొబైల్ లో రికార్డు చేశాడు. జవేరీతో విమాన పైలట్ అభిమానంగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ముంబై నుంచి దుబాయికి విమాన ప్రయాణం మూడు గంటలే ! అన్నట్టు ఈ ప్లేన్ స్టాఫ్ ఇతనికి తమ ప్లేన్ లోని అన్ని భాగాలను చూపారు. పైలట్ కాక్-పిట్ సహా అన్నింటినీ చూపి వాటి వివరాలను వివరించారు. కాగా చాలామంది ఈ వీడియో చూసి జవేరీని లక్కీయేస్ట్ మ్యాన్ గా అభివర్ణిస్తే కొందరు మాత్రం విమానం ఖాళీగా ఉన్న సీట్లతో ఉంటే మజా ఏమిటని, నిండుగా ఉంటేనే చూడాలనిపిస్తుందని అంటున్నారు.

మరిన్ని వీడియోలు చూడండి ఇక్కడ : Cyclone Yaas Live Video : అల్లకల్లోలంగా సముద్రతీరం..అతి తీవ్రమైన తుఫానుగా మారిన యాస్ సైక్లోన్..!(వీడియో).

Corona Virus: 100 మంది బౌద్ధ సన్యాసులకు కరోనా పాజిటివ్… చిన్న రాష్ట్రమైన సిక్కింలో కేసుల పెరుగుదల.. ( వీడియో ) Viral Video: వినూత్నంగా ఆకాశం లో ఎగురుతూ పెళ్లి… ఆతర్వాత ఏమైందో తెలిసి షాక్ లో కుటుంబ సభ్యులు.. ( వీడియో )