హోటల్‌లో తేడాగా కనిపించిన నలుగురు మహిళలు.. అనుమానం వచ్చి చెక్ చేయగా..
ముంబై నగరంలోని కోలాబా ప్రాంతంలో పోలీసులు అంతర్జాతీయ బంగారు స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నలుగురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు ఎథియోపియా, ఇద్దరు కెన్యా దేశాలకు చెందినవారిగా గుర్తించారు. మహిళల నుంచి పోలీసులు 72.7 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇది బంగారం స్మగ్లింగ్ చేసి విక్రయించగా వచ్చిన డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

ముంబై నగరంలోని కోలాబా ప్రాంతంలో పోలీసులు అంతర్జాతీయ బంగారు స్మగ్లింగ్ ముఠాను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా నలుగురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు ఎథియోపియా, ఇద్దరు కెన్యా దేశాలకు చెందినవారిగా గుర్తించారు. మహిళల నుంచి పోలీసులు 72.7 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఇది బంగారం స్మగ్లింగ్ చేసి విక్రయించగా వచ్చిన డబ్బుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరో ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం అదుపులో ఉన్న మహిళల్లో ఎథియోపియన్ జాతీయులైన అనేబ్ అబ్దియా, ఫాతిమా షాలే, కెన్యా దేశస్తులైన ఫర్తున్ అహ్మద్, అమీనా ఫరా ఉన్నారు.
ముంబైకు వచ్చిన రెండు రోజుల తర్వాత కోలాబా ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు. అంతర్జాతీయ బంగారం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో వీరు ఉన్నట్టుగా పోలీసులకు అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నారు. జూలై 12న పోలీసులకు ఓ సమాచారం రావడంతో కోలాబా పోలీస్ స్టేషన్ సమీపంలో విదేశీయుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్నారని, నిందితుల దగ్గర భారీగా నగదు ఉందని పోలీసులు చెబుతున్నారు.
ఈ నలుగురి దగ్గర నాలుగు బ్యాగుల్లో మొత్తం రూ.72.7 లక్షలు గుర్తించారు. విచారణలో ఈ మహిళలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు. భాష అర్థం కావడం లేదని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. ఈ డబ్బు వస్త్ర వ్యాపారానికి సంబంధించినదని మహిళలు పోలీసులకు చెప్పినా ఎలాంటి ఆధారాలు మాత్రం చూపడం లేదు.
అయితే, నిందితుల దగ్గర వీసాలు, పాస్‌పోర్టులు ఉన్నాయని పోలీసులు ధృవీకరించారు. కానీ నగదు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై మాత్రం విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ కేసును ఆదాయ పన్నుశాఖకు అప్పగించి, మహిళల పత్రాలను పరిశీలిస్తున్నారు.
ఈ ముఠా నాయకుడు ఎవరో త్వరలో తేలుతుందని పోలీసులు చెబుతున్నారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. త్వరలోనే ఈ ముఠా వ్యవహారం మొత్తం బయటపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




