Covid-19 Guidelines : కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై అధికారుల కొరఢా.. మాస్క్ లేకుంటే రూ.1000 జరిమానా
Corona Guidelines: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతోంది. అయితే ఇతర దేశాల నుంచి..
Corona Guidelines: దేశంలో కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతోంది. అయితే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి అడుగు పెట్టే ప్రయాణికుల వల్లనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక విమానాశ్రయాల్లో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు విమానయాన అధికారులు. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారీగా జరిమానాలు విధిస్తున్నారు. ఈ జరిమానా విధించడం ముంబై విమానాశ్రయంలో ప్రారంభించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) దీనికి సంబంధించి హెచ్చరిక జారీ చేసింది.
కొన్ని విమానాశ్రయాలలో ప్రయాణికులు తప్పనిసరి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించింది. విమానాశ్రయ ప్రాంగణంలో కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు జరిమానా విధించాలని రెగ్యులేటర్ పేర్కొంది.
అంతర్జాతీయ విమానాశ్రయాల్లో డీజీసీఏ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి కోవిడ్ -19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ప్రయాణికులకు రూ .1000 జరిమానా విధిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఒక ప్రయాణికుడు మాస్క్ ధరించకున్నా, ఇతర కోవిడ్ నిబంధనలు పాటించకున్నా.. రూ.1000 జరిమానా విధించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
కాగా, శనివారం ముంబైలో 9,000 కొత్త కేసులు నమోదయ్యాయి. 5,322 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 27 మంది కరోనాతో మరణించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 49,447 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 277 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇవీ చదవండి: Education loans: ఉన్నత విద్య కోసం రుణాలు అందజేస్తున్న బ్యాంకులు ఇవే.. వడ్డీకి ట్యాక్స్ మినహాయింపు..!
SBI Customer Alert: ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్.. ఆ సేవలు నిలిపివేత.. వెల్లడించిన ఎస్‌బీఐ