AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. వైరలవుతున్న వీడియో

ధోనీ. ఈ పేరు వింటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పునకాలు వచ్చేస్తాయి. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టాడంటే చాలు.. ఆయన ఆ స్టేడియం నుంచి వెళ్లిపోయేవరకు మొత్తం అభిమానుల అరుపులు, కేకలే వినబడతాయి. అలాగే ధోనీ ఆటకి ఓ వైపు అభిమాలు ఉంటే.. ఆయన చూపించే మానవత్వం, సింప్లిసిటీకి కూడా అభిమానులు ఉన్నారు. అందుకే ధోనీకి దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగేటప్పుడు చాలా మంది చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటని చూసేందుకు ఆసక్తి చూపుతారు.

Watch Video: ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోనీ.. వైరలవుతున్న వీడియో
Ms Dhoni With Trump
Aravind B
|

Updated on: Sep 08, 2023 | 1:45 PM

Share

ధోనీ. ఈ పేరు వింటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పునకాలు వచ్చేస్తాయి. ధోనీ స్టేడియంలో అడుగుపెట్టాడంటే చాలు.. ఆయన ఆ స్టేడియం నుంచి వెళ్లిపోయేవరకు మొత్తం అభిమానుల అరుపులు, కేకలే వినబడతాయి. అలాగే ధోనీ ఆటకి ఓ వైపు అభిమాలు ఉంటే.. ఆయన చూపించే మానవత్వం, సింప్లిసిటీకి కూడా అభిమానులు ఉన్నారు. అందుకే ధోనీకి దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగేటప్పుడు చాలా మంది చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటని చూసేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే దానికి ధోనియే సారథ్యం వహిస్తాడు కాబట్టి. కేవలం ధోనీ ఆటనే చూసేందుకు టీవీలో, ఫోన్లలో క్రికెట్ చూసే వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు వికెట్ కీపింగ్ చేసే ధోని.. సెకన్ల వ్యవధిలోనే ప్రత్యర్థులను ఔట్ చేస్తాడు. వాస్తవానికి ఇలా ఏ వికెట్ కీపర్ కూడా చేయలేదు. అది ధోనికి ఉన్న ప్రత్యేకత.

ఇక వివరాల్లోకి వెళ్తే ఇండియా తరఫున ఆడేటప్పుడు ఎప్పుడూ కూడా బిజీగా గడిపే మాజీ కెప్టెన్ ధోనీ.. ఇటీవలే రిటైర్మెంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన రిటైర్మెంట్ ఇచ్చాక ఇప్పుడు సరదాగా తన జీవితాన్ని గడుపుతున్నాడు. ముఖ్యంగా కుటుంబ సభ్యలు, స్నేహితులతో గడిపేందుకు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తున్నాడు. అలాగే 2023లో చైన్నై సూపర్ కింగ్స్‌ను విజేతగా నిలిపిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఆ తర్వాత కొన్ని రోజు పాటుగా రాంఛీ విధుల్లో చక్కర్లు కొట్టాడు. ఆ తర్వాత చెన్నైలోని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కాస్త హంగామా చేశారు. అయితే ఇప్పుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ధోనీ ఇటీవల యూఎస్ ఓపెన్ 2023 మ్యాచ్‌లో కనిపించిన విషయం తెలిసిందే. అభిమానుల మధ్యలోనే కూర్చోని టెన్నిస్ మ్యాచ్‌ను చూస్తూ ఎంజాయ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే ప్రస్తుతం అమెరికాలో ఉన్న ధోనీ.. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. ట్రంప్ ఆహ్వానం మేరకు అతడిని కలిసేందుకు వెళ్లిన మహీ.. సరదగా ఆయనతో కలిసి గోల్ఫ్ ఆడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడయో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి ధోనీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆటడం మానేసినప్పటికీ కూడా.. ప్రపంచంలో అత్యంత ప్రజాదారణ పొందినటువంటి క్రికెటర్లలో ఒకడిగా నిలిచాడు. రైల్వే స్టేషన్‌లో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేసిన ధోనీ.. తక్కువ కాలంలోనే ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్‌గా ఎదిగిపోయాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2007, అలాగే 2011లో జరగిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌.. అలాగే 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియాకు అందించాడు. 2020 ఆగస్టు 15న అతడు అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అయితే ఈసారి 2024లో కూడా ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు సార్థత్యం వహించేదుకు సిద్ధంగా ఉన్నాడు.