రెండు కూనల్ని చంపిన పులి.. ఎందుకో మరి..?

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మగపులి రెండు పులి కూనల్ని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన బందవ్‌గర్‌ టైగర్‌ రిజర్వ్ ప్రాంతంలో ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది.

  • Tv9 Telugu
  • Publish Date - 4:13 pm, Tue, 16 June 20
రెండు కూనల్ని చంపిన పులి.. ఎందుకో మరి..?

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ మగపులి రెండు పులి కూనల్ని పొట్టనబెట్టుకుంది. ఈ ఘటన బందవ్‌గర్‌ టైగర్‌ రిజర్వ్ ప్రాంతంలో ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అధికారులకు.. తాలా ప్రాంతంలోని కత్లీ బీట్‌లో రెండు పులి కూనలు చనిపోయి ఉండటాన్ని గుర్తించారు. తొలుత మరేదో జంతువు ఈ పులి కూనల్ని చంపేసి ఉంటుందనుకున్నారు. అయితే ఆ పులి కూనల మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పంపగా.. రిపోర్ట్స్‌లో ఈ పులి కూనల్ని ఓ మగ పులి చంపిందని తేలింది. ఈ విషయాన్ని బందవ్‌గర్‌ టైగర్ రిజర్వ అసిస్టెంట్‌ డైరక్టర్ అనిల్ శుక్లా మంగళవారం తెలిపారు. ఈ పులి కూనల మరణానికి సంబంధించిన రిపోర్టును జాతీయ పులుల సంరక్షణ సంస్థకు వెల్లడించామన్నారు.