‘అమ్మ గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితం’.. కన్నీరు పెట్టిస్తోన్న బాలిక సూసైడ్ నోట్
ఆడపిల్లగా పుడితే బ్రతుకు భారం అవుతుంది. అనాధిగా ఇదే తంతు కొనసాగుతోంది. నాగరికత పెరుగుతున్నా మహిళలపై దాడులు ఆగడం లేదు.

ఆడపిల్లగా పుడితే బ్రతుకు భారం అవుతుంది. అనాధిగా ఇదే తంతు కొనసాగుతోంది. నాగరికత పెరుగుతున్నా మహిళలపై దాడులు ఆగడం లేదు. కఠిన చట్టాలు తెస్తున్నా.. కఠినాత్ముల మనసులు మారడం లేదు. అమ్మ కడుపు నుంచి.. భూతల్లి కడుపు చేరేవరకు మహిళది నరక ప్రయాణం. ఎందరో మహిళలు.. కామాంధుల కబంద హస్తాల్లో చిక్కి శల్యమవుతున్నాయి. బయటకు చెప్పలేక కొందరు బాధను పంటి బిగువున బరిస్తుంటే.. మరికొందరు ఈ పాడు సమాజంలో బ్రతకలేక.. జీవితాలను చాలిస్తున్నారు. ప్రతిరోజూ దేశంలో ఏదో ఓ మూలన అత్యాచార ఘటనలు, చిన్న పిల్లలపై లైంగిక దాడుల ఘటనలకు సంబంధించిన వార్తలు వింటూనే ఉన్నాం. ఇక పని చేసే ప్రాంతాల్లో వేధింపుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అలానే మానసిక వేధింపులకు గురైన ఓ బాలిక.. తన బాధను బయటకు పంచుకోలేక నరకయాతన అనుభవించి చివరకు తనువు చాలించింది. ఆమె రాసిన సూసైడ్ నోట్ హృదయాన్ని బరువెక్కిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే… చెన్నైలోని పూనమల్లే ప్రాంతానికి చెందిన 11వ తరగతి విద్యార్థిని కొద్దిరోజుల క్రితం అదృశ్యమవగా.. తాజాగా పోలీసులు ఆమె డెడ్‌బాడీని గుర్తించారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… ఆమె ఇంట్లో ఓ సూసైడ్ నోట్‌ను గుర్తించారు. కాగా ఆ లెటర్‌లో ‘తల్లి గర్భం, సమాధి మాత్రమే మహిళకు సురక్షితమైన ప్రదేశాలు’ అని సదరు విద్యార్థిని రాసుకొచ్చింది. తన కుమార్తె 9వ తరగతి వరకు ఓ ప్రైవేటు స్కూల్లో చదివిందని, అక్కడ పనిచేసే ఓ ఉపాధ్యాయుడి కుమారుడు తన కుమార్తెను వేధించేవాడని తల్లి పోలీసులకు వివరించింది. ఆ వేధింపుల కారణంగానే ఇప్పుడు మరో స్కూల్లో చేర్పించినట్లు వివరించింది. తల్లి కంప్లైంట్‌తో పోలీసులు ఈ కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ బచ్చన్‌కు ఈడీ సమన్లు.. ఆ కేసులో బిగుస్తోన్న ఉచ్చు
Andhra Pradesh: పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి




