AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TN Fishermen Arrest: 55 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..

TN fishermen held by Sri Lankan Navy: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను

TN Fishermen Arrest: 55 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక నావికాదళం..
Tn Fishermen
Shaik Madar Saheb
|

Updated on: Dec 20, 2021 | 11:45 AM

Share

TN fishermen held by Sri Lankan Navy: శ్రీలంక నావికాదళం మరోమారు భారత మత్స్యకారులపై దాడులకు దిగింది. తమ దేశపు సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ తమిళనాడుకు చెందిన మత్స్యకారులను అరెస్ట్ చేసింది. శనివారం సాయంత్రం తమిళనాడుకు చెందిన 43 మంది మత్స్యకారులను శ్రీలంక నావికా దళం అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీరు ప్రయాణిస్తున్న 6 పడవలను సైతం స్వాధీనం చేసుకుంది. అనంతరం శ్రీలంక నావికాదళం వారిని కంగెసంతురాయ్ శిబిరానికి తీసుకెళ్లారు. ఈ వివరాలను తమిళనాడు మత్స్యశాఖ అధికారి ఆదివారం ప్రకటించారు. రామేశ్వరం నుంచి వెళ్లిన 43 మంది జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్టు చేసి.. 6 ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకున్నారని వెల్లడించారు. దీంతోపాటు.. శ్రీలంక నావికాదళం మరో 12 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. తమ దేశ ప్రాదేశిక జలాల్లో వేటాడినట్లు ఆరోపిస్తూ 12 మంది జాలర్లను అదుపులోకి తీసుకోని రెండు ఫిషింగ్ బోట్లను స్వాధీనం చేసుకుంది. గత రెండు రోజుల్లో శ్రీలంక నేవీ అరెస్ట్ చేసిన భారతీయుల సంఖ్య 55 కి చేరుకుందని సోమవారం అధికారులు ప్రకటించారు.

ఈ సంఘటన గురించి తెలుసుకున్న తమిళ జాలర్ల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. వారిని వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేసింది. శ్రీలంక తీరుకు నిరసనగా మత్స్యకార సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. అధికారులు చొరవతీసుకొని మత్స్యకారులను విడిపించాలని వారి కటుంబాలు కోరుతున్నాయి. కాగా.. తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాయి. తమిళనాడుకు చెందిన మత్స్యకారుల విడుదల కోసం శ్రీలంక అధికారులతో వెంటనే మాట్లాడాలని అభ్యర్థించాయి. తమిళనాడుకు చెందిన కేంద్ర మత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇప్పటికే భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు ప్రారంభించారు.

కాగా.. రామేశ్వరం ప్రాంతానికి చెందిన సుమారు 500 మంది జాలర్లు మరపడవల్లో శనివారం వేకువజామున సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. ఆదివారం వేకువజామున భారత్‌, శ్రీలంక దేశాల సముద్రజలాల సరిహద్దులో ఉన్న కచ్చాతీవు సమీపం నెడుదీవు వద్ద సుమారు జాలర్లు చేపలు పడుతుండగా 20 గస్తీ పడవలలో వచ్చిన శ్రీలంక నావికాదళం సిబ్బంది వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. తమ దేశపు సముద్రజలాల్లో అక్రమంగా చొరబడి చేపలు పడుతున్నారంటూ దాడికి దిగారు. ఈ ఘటనను చూసిన మిగతా జాలర్లంతా భయంతో స్వస్థలానికి తిరుగుముఖం పట్టారు. ఆదివారం ఉదయం రామేశ్వరం తీరం చేరుకున్న జాలర్లు శ్రీలంక నావికాదళం దాష్టీకం గురించి తెలపడంతో.. ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:

Heroin Seized: గుజరాత్ తీరంలో భారీగా డ్రగ్స్ స్వాధీనం.. రూ. 400 కోట్లు విలువ ఉంటుందన్న అధికారులు

Warangal: హనుమకొండలో దారుణం.. దహన సంస్కారాలకు దారి ఇవ్వకపోవడంతో ఇంట్లోనే మృతదేహం..!