AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kolkata Municipal Elections: మమతా బెనర్జీని నియంత కిమ్‌‌తో పోల్చిన బీజేపీ.. ఎందుకో తెలుసా..

బెంగాల్ సీఎం మమత బెనర్జీపై మరోసారి దాడి చేసింది బీజేపీ. ఆమెను ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్‌తో పోల్చింది. కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై బెంగాల్ అసెంబ్లీలో..

Kolkata Municipal Elections: మమతా బెనర్జీని నియంత కిమ్‌‌తో పోల్చిన బీజేపీ.. ఎందుకో తెలుసా..
Mamata Banerjee To North Ko
Sanjay Kasula
|

Updated on: Dec 20, 2021 | 12:56 PM

Share

బెంగాల్ సీఎం మమత బెనర్జీపై మరోసారి దాడి చేసింది బీజేపీ. ఆమెను ఉత్తర కొరియా అధినేత, నియంత కిమ్ జోంగ్‌తో పోల్చింది. కోల్‌కతా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనలపై బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి ఆదివారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నిందించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్-ఉన్‌తో పోల్చారు. ఈరోజు కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కోల్‌కతా పోలీసుల కనుసన్నల్లోనే ఓట్లను దోచుకున్నారని విమర్శించారు. మొత్తం ఎన్నికలను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయమై ఈరోజు గవర్నర్‌ను కలిశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వెన్నుపోటు పొడిచిన కమిషనర్‌‌గా ఉన్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. మమతా బెనర్జీ తీరు ఉత్తర కొరియా కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పోలినట్లుగా ఉందన్నారు. కోల్‌కతా పోలీసులు TMC కేడర్‌లా ప్రవర్తిస్తున్నారు” అని ఆయన అన్నారు.

టీఎంసీ గూండాలను రక్షించాలని మమతా బెనర్జీ పోలీసులను ఆదేశించారని బిజెపి నేత ఆరోపించారు. “పోలీసులకు మమతా బెనర్జీ సూచన మేరకే ఇలా పని చేస్తున్నారు. దాడులు జరుగుతుంటే రిక్తహస్తాలతో చూస్తూ ఉంటున్నారు. అంతే కాదు TMC గూండాలను రక్షించేపనిలో ఉన్నారు. 30-40 శాతం బయటి ఓటర్ల మద్దతుతో ఓటింగ్ జరిగింది. ప్రతి TMC గూండా 8 నుండి 10 ఓట్లు వేశారు. మా వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి. ఎన్నికలు.. సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.

ఆదివారం జరిగిన ఎన్నికల సందర్భంగా ‘ప్రబలిన’ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో బీజేపీ ఈ మేరకు డిమాండ్ చేసింది. అధికారీలోని బిధాన్‌నగర్ పోలీసుల వర్చువల్ హౌస్ అరెస్ట్‌పై దర్యాప్తు చేయాలని ప్రతినిధి బృందం కోరింది.

ఇవి కూడా చదవండి: Byreddy Siddharth Reddy: బైరెడ్డా.. మజాకా.. సీఎంకు బర్త్ డే విషెస్ ఎలా చెప్పాడో చూడండి

Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..