AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Minister Harish Rao: గ్రామాలకొస్తే బీజేపీ నేతల గళ్లా పట్టుకుని నిలదీయాలి.. మంత్రి హరీశ్ రావు పిలుపు

TS Minister Harish Rao: వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలను గ్రామగ్రామాన నిలయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో బీజేపీ నేతలు గ్రామాలకు వస్తే గళ్లా పట్టుకుని అడగాలన్నారు.

TS Minister Harish Rao: గ్రామాలకొస్తే బీజేపీ నేతల గళ్లా పట్టుకుని నిలదీయాలి.. మంత్రి హరీశ్ రావు పిలుపు
Telangana Minister Harish Rao
Janardhan Veluru
|

Updated on: Dec 20, 2021 | 2:45 PM

Share

TS Minister Harish Rao: వడ్ల కొనుగోలు విషయంలో బీజేపీ నేతలను గ్రామగ్రామాన నిలయాలని తెలంగాణ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. వడ్లు ఎందుకు కొనుగోలు చేయరో బీజేపీ నేతలు గ్రామాలకు వస్తే గళ్లా పట్టుకుని అడగాలన్నారు. అలాగే బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో ప్రశ్నించాలని సూచించారు. గజ్వేల్‌లో జరిగిన రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడిన ఆయన.. రైతన్న బాగుపడాలంటే కేంద్రంలో బీజేపీ గద్దే దిగాల్సిందేనన్నారు. బీజేపీ రైతులను దగా చేస్తోందని.. వడ్లు కొనకుండా బీజేపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు.

బీజేపీ నేతలు సొల్లు కబుర్లు చెప్పడం మానుకుని వడ్లు కొంటరా…కొనరో సూటిగా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారన్నారు. అలాగే రైతుల సాగునీటి కోసం కేసీఆర్ ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. అలాగే రైతుల ఖాతాల్లో నేరుగా నగదు బదిలీ చేస్తోందని గుర్తుచేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 50 వేల కోట్ల రైతుల ఖాతాల్లో నేరుగా జమచేసినట్లు వివరించారు. అలాగే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించినట్లు గుర్తుచేశారు. రైతుల కోసం సీఎం చేయాల్సింది చేశారని.. అయితే ట కొనాల్సిన కేంద్రం చేతులెత్తేస్తోందని ఆరోపించారు. అయితే తెలంగాణ రైతు ఆగం కావాలి.. ఆ కోపం టీఆర్ఎస్ మీద వస్తే రాజకీయంగా లబ్ధి పొందుదామని బీజేపీ నేతలు కుట్రు పన్నుతున్నారని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వానికి దేశ రక్షణ, విదేశీ విధానంతో పాటు ఫుడ్ సేఫ్టీ బాధ్యత కూడా ఉందన్నారు. పంటలు పండిన చోట ధాన్యాన్ని కొనుగోలు చేసి.. పండని చోట, ప్రకృతి విలయాలు ఏర్పిడన చోట ప్రజల అవసరాల మేరకు ధాన్యాన్ని అందుబాటులో ఉంచడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు. పంటలు పండించడం రాష్ట్రం బాధ్యత, దాన్ని కొనే బాధ్యత కేంద్రానిదని స్పష్టంచేశారు. కేంద్రం ధాన్యం కొనదు కాబట్టే.. కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టంచేశారు. వడ్లు పండిస్తే రైతు నష్టపోకూడదనే సీఎం కేసీఆర్.. వడ్డు పండించొద్దని, ప్రత్నామ్నాయపంటలు వేయండని కోరుతున్నట్లు చెప్పారు.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే మీ ప్రధానిని ఒప్పించి యాసంగిలో వడ్లు కొంటవా? కొనవా? ముందుగా చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ముందుగా ధాన్యం కొనిపించి మాట్లాడాలని.. ఆయన సొల్లు పురాణం వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. రైతు వ్యతిరేక బీజేపీకి ప్రజలు గుణ పాఠంచెప్పాలన్నారు. బీజేపీ రైతుల ఉసురు పోసుకుని కార్పొరేట్ వర్గాలకు లాభం చేస్తోందని..బడా బడా కంపెనీలకు కొమ్ము కాస్తుందని ధ్వజమెత్తారు.

Also Read..

Royal Enfield Classic 350: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లో లోపాలు.. బైక్‌లను వెనక్కి తీసుకునేందుకు కంపెనీ నిర్ణయం!

Shocking: యూట్యూబ్‌లో చూస్తూ భార్యకు డెలివరీ.. చివరకు ఊహించని విషాదాంతం

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు