Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతులకు శుభవార్త..! మోడీ ప్రభుత్వం ఆ విషయంపై సంచలన నిర్ణయం.. తెలుసుకోండి..

Agriculture News: దేశంలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ

రైతులకు శుభవార్త..! మోడీ ప్రభుత్వం ఆ విషయంపై సంచలన నిర్ణయం.. తెలుసుకోండి..
Farmers
Follow us
uppula Raju

|

Updated on: Oct 18, 2021 | 9:34 PM

Agriculture News: దేశంలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతులకు పెద్ద ఉపశమనం కల్పిస్తూ యూరియాపై సబ్సిడీని పెంచింది. కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా సోమవారం ఈ విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ఎరువుల ధరలు పెరుగుతున్నాయని రైతుల డిమాండ్‌ను నెరవేర్చడానికి ప్రభుత్వం బయటి నుంచి వివిధ రకాల ఎరువులను దిగుమతి చేసుకోవాల్సి ఉందని వివరించారు.

యూరియాపై సబ్సిడీ రూ.2000 పెరిగింది అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచడానికి బదులు సబ్సిడీని పెంచిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య తెలిపారు. రైతులు నష్టపోకుండా ఉండాలని, వారికి లాభాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యూరియాపై సబ్సిడీని ఒక్కో బ్యాగ్‌పై రూ.1500 నుంచి రూ.2000 కి పెంచినట్లు మంత్రి చెప్పారు.

28 వేల కోట్లు రైతులకు సబ్సిడీగా ఇచ్చారు యూరియా కాకుండా కేంద్ర ప్రభుత్వం డీఏపీపై ఇచ్చే సబ్సిడీని రూ.1200 నుంచి రూ.1650కి పెంచింది. అలాగే ఎన్‌పికెపై కూడా సబ్సిడీ పెంచింది. ఈ రబీ సీజన్‌లో రైతులకు ఇచ్చే ఎరువులపై సబ్సిడీగా మొత్తం 28 వేల కోట్ల రూపాయలు ప్రధాన మంత్రి ఖర్చు చేశారని కేంద్ర మంత్రి వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నాయి.. ఖరీఫ్ పంటల కోత తర్వాత రైతులు ఇప్పుడు రబీ పంటలు వేస్తున్నారు. ఇంతలో దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ఎరువుల కొరత గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ధరలు పెరగడం వల్ల ఎరువుల దిగుమతులు తగ్గాయి. భారతదేశంలో దిగుమతి చేసుకున్న DAP ధర ఈసారి టన్నుకు $ 675 నుంచి $ 680కి చేరుకుంది.

Fine to SBI: ఎస్బీఐకి షాకిచ్చిన రిజర్వ్ బ్యాంక్.. ఏకంగా ఎంత ఫైన్ వేసిందంటే..

4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్.. టీ 20 వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డ్‌.. ఎవరో తెలుసా..?

Ram Gopal Varma: చదువుకునే రోజుల్లో వర్మ ఎంత బ్యాడ్‌ స్టూడెంటో తెలుసా.? దానికి ఈ ఫోటోనే ఉదాహరణ..!