Viral Video: కత్తులతో భజరంగ్ దళ్ సభ్యుల డ్యాన్సులు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. వీడియో వైరల్..

Bajrang Dal: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో రోడ్డు మధ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు కత్తులతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video: కత్తులతో భజరంగ్ దళ్ సభ్యుల డ్యాన్సులు.. చర్యలు తీసుకుంటామన్న పోలీసులు.. వీడియో వైరల్..
Bajrang Dal
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 18, 2021 | 9:45 PM

Bajrang Dal: కర్ణాటకలోని బెళగావి జిల్లాలో రోడ్డు మధ్యలో బజరంగ్ దళ్ కార్యకర్తలు కత్తులతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం కర్ణాటక పోలీసులు స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామంటూ బెళగవి పోలీసు అధికారి తెలిపారు. అక్టోబర్ 13న బుధవారం ఆయుధ పూజ సందర్భంగా ఈ ఊరేగింపు జరిగినట్లు సమాచారం. ఊరేగింపులో భజరంగ్ దళ్ సభ్యులెవరూ కోవిడ్ -19 ప్రోటోకాల్‌ పాటించలేదు. మాస్కులు ధరించలేదు..భౌతిక దూరం పాటించలేదు. ఈ వీడియో వైరల్ అయిన తరువాత పలువురు నెటిజన్లు.. ట్విట్టర్‌లో కర్ణాటక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కరోనా విజృంభిస్తోందని.. దీంతోపాటు నడిరోడ్డుపై కత్తులతో డ్యాన్సులు చేయడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేశారు.

కాగా.. ఈ వీడియో వైరల్ అయిన అనంతరం బెళగవి డిప్యూటీ కమిషనర్ ఎంజి హిరేమథ్ స్పందించారు. దీనిపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని.. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామంటూ హిరేమథ్ తెలిపారు. ఆయుధ పూజ సందర్భంగా భజరంగ్ దళ్ సభ్యులు పీరన్‌వాడిలో ఊరేగింపు నిర్వహించారు. డీజే పాటకు అనుగుణంగా భజరంగ్ సభ్యులు కత్తులతో నృత్యం చేస్తున్నారు. అయితే.. ఈ కార్యక్రమం పోలీసు భద్రతా నడుమ జరిగిందని.. కోవిడ్ నిబంధనలు ఉన్నప్పటికీ ఎవరూ పాటించలేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోను మీరు కూడా చూడండి..

ట్విట్టర్‌లో నెటిజన్ షేర్ చేసిన వీడియో..

Also Read:

Mysterious Death: బిస్కెట్లు, చిప్స్ తిని కుప్పకూలిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. 24 గంటల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు..

Midnight Horror: తల్లి నిద్రపోయిన కాసేపటికే.. కవలల దుర్మరణం.. అర్ధరాత్రి 25వ అంతస్థు పైనుంచి పడి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!