Ram Gopal Varma: చదువుకునే రోజుల్లో వర్మ ఎంత బ్యాడ్ స్టూడెంటో తెలుసా.? దానికి ఈ ఫోటోనే ఉదాహరణ..!
Ram Gopal Varma: కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌గోపాల్ వర్మ ఉంటారు. ఒకవేళ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా తానే ఓ సంచలనంగా మారుతారు. ఎప్పటికప్పుడు మీడియాలో..
Ram Gopal Varma: కాంట్రవర్సీ ఎక్కడ ఉంటే అక్కడ రామ్‌గోపాల్ వర్మ ఉంటారు. ఒకవేళ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా తానే ఓ సంచలనంగా మారుతారు. ఎప్పటికప్పుడు మీడియాలో ఉండేలా చూసుకునే వర్మ. ఎక్కడలేని వివాదాన్ని నెత్తిన వేసుకుంటారు. ఈ క్రమంలోనే ట్విట్టర్‌ను అస్త్రంగా మార్చుకొని చిత్ర విచిత్రమైన పోస్టులు చేస్తుంటారు. ఇలా వర్మ చేసిన కొన్ని పోస్టులు కొన్ని సందర్భాల్లో పెద్ద రచ్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన ఓ ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చదువుకునే రోజుల్లో తాను చాలా బ్యాడ్ స్టూడెంట్‌ని అని ఎప్పుడు చెప్పుకునే వర్మ. చదువుపై తనకున్న అశ్రద్ధను ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంజినీరింగ్ చదివి ఫిలిమ్ మేకర్ అయిన వర్మ తాను ఎప్పుడూ బ్యాక్ బెంచ్ స్టూడెంట్‌నని చెబుతుంటారు. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా ఓ ఫోటోను పోస్ట్ చేసి.. ‘చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఇలాంటి విద్యార్థినే’ అని పోస్ట్ చేశారు. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందనేగా.. ఇద్దరు విద్యార్థులు పరీక్షా కేంద్రంలో కూర్చొని పరీక్ష రాస్తున్నారు.
ఈ సమయంలో వెనకాల కూర్చున్న వ్యక్తి ముందు ఉన్న వ్యక్తిని జవాబులు అడుగుతుంటాడు. ఈ సమయంలో ఫుల్ స్టాప్ పెట్టమని చెప్పగా.. ఆ వెనకాల కూర్చున్న విద్యార్థి.. ‘ఫుల్ స్టాప్ స్పెల్లింగ్’ ఏంటీ అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అంటే బ్యాక్ బెంచర్ స్టూడెంట్స్ ఇలా ఉంటారు అని అర్థం వచ్చేలా ఉన్న ఈ ఫోటో నవ్వులు పూయిస్తోంది. వర్మ చేసిన ఈ ట్వీట్‌కు పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వర్మ ప్రస్తుతం కొండ సురేఖ, మురళీల బయోపిక్ తెరకెక్కించే పనిలో ఉన్న విషయం తెలిసిందే.
I was this bad in school ? pic.twitter.com/1GlOQbV5xr
— Ram Gopal Varma (@RGVzoomin) October 17, 2021
Also Read: Viral Photos: అక్కడ బర్గర్ షేర్ చేసుకుంటే జైలుకే..! ఈ వింత చట్టం ఎక్కడుందంటే..?
Squid Game: ‘స్క్విడ్ గేమ్’ రీక్రియేషన్….చిన్నారుల ప్రతిభకు నెటిజన్ల ఫిదా!
Samantha: నయనతార దారిలో సామ్…కొత్త సినిమాలకు కొత్త కండిషన్లు!!