AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్.. టీ 20 వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డ్‌.. ఎవరో తెలుసా..?

T20 World Cup: ఐపీఎల్‌ నుంచి అభిమానులు తేరుకోకముందే టీ 20 వరల్డ్‌ కప్‌ సందడి మొదలైంది. ఆటగాళ్లు మంచి ఊపుమీద ఉండి కొత్త కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నారు.

4 బంతుల్లో 4 వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్.. టీ 20 వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డ్‌.. ఎవరో తెలుసా..?
Curtis Capher
uppula Raju
|

Updated on: Oct 18, 2021 | 9:11 PM

Share

T20 World Cup: ఐపీఎల్‌ నుంచి అభిమానులు తేరుకోకముందే టీ 20 వరల్డ్‌ కప్‌ సందడి మొదలైంది. ఆటగాళ్లు మంచి ఊపుమీద ఉండి కొత్త కొత్త రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్నారు. తాజాగా టీ 20 వరల్డ్‌ కప్‌లో అరుదైన రికార్డ్‌ నమోదైంది. ఈ రోజు జరిగిన ఐర్లాండ్ వర్సెస్ నెదర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ బౌలర్‌ కార్టిస్ కాంపర్ ఈ ఫీట్ సాధించాడు. టీ 20 ఇంటర్నేషనల్‌లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఐరిష్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. లసిత్ మలింగ, రషీద్ ఖాన్ తర్వాత వరుసగా 4 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ తర్వాత పురుషుల ఐసిసి టి 20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్.

నెదర్లాండ్స్ ఇన్నింగ్స్10వ ఓవర్లో కార్టిస్ కాంపర్ వరుస డెలివరీలలో కోలిన్ అకెర్మాన్, ర్యాన్ టెన్ డోస్కేట్, స్కాట్ ఎడ్వర్డ్స్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వేలను అవుట్ చేశాడు. కార్టిస్ కాంపర్ మీడియం పేస్ బౌలింగ్ చేసే సమర్థవంతమైన ఆల్ రౌండర్ కూడా. కాన్ఫర్ ఇప్పటివరకు 10 వన్డేలు ఆడాడు. అందులో అతను 51.28 సగటుతో 359 పరుగులు చేశాడు. 8 వికెట్లు తీసుకున్నాడు. అతను నాలుగు టి 20 మ్యాచ్‌లలో 13.33 సగటుతో 40 పరుగులు చేశాడు. మూడు వికెట్లు కూడా తీశాడు.

కార్టిస్ ఏప్రిల్ 20, 1999 న జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించారు. అతను తన కెరీర్‌ని దక్షిణాఫ్రికాలో ప్రారంభించాడు. కార్టిస్ అమ్మమ్మ ఐర్లాండ్ నుంచి వచ్చింది. దీంతో అతనికి ఐర్లాండ్ పాస్‌పోర్ట్ కూడా ఉంది. కార్టిస్ ఐర్లాండ్ తరఫున క్రికెట్ ఆడాలనుకున్నాడు అప్పటి ఐరిష్ కెప్టెన్ నైలు ఓబ్రెయిన్‌కి తన కోరికను తెలిపాడు. అతను ఒప్పుకొని ఐర్లాండ్‌కు వచ్చి క్రికెట్ ఆడమని ఆహ్వానించాడు. దీంతో అతడు ఐర్లాండ్‌కు వచ్చి ఆ దేశం తరపున క్రికెట్‌ ఆడటం ప్రారంభించాడు. టీ 20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయడంతో ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తున్నాడు.

Ram Gopal Varma: చదువుకునే రోజుల్లో వర్మ ఎంత బ్యాడ్‌ స్టూడెంటో తెలుసా.? దానికి ఈ ఫోటోనే ఉదాహరణ..!

Diwali Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. దీపావళి బోనస్ ప్రకటించిన మోదీ సర్కార్..

NASA Lucy Mission: ఇక బృహస్పతి వైపు నాసా చూపు.. విశ్వరహస్యాల అన్వేషణలో సుదీర్ఘ లూసీ మిషన్ ప్రారంభం!