AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Model Aparna singh: చిల్లర కామెంట్స్ ఎఫెక్ట్.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన మోడల్ అపర్ణా సింగ్..

అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన మోడల్‌ అపర్ణా సింగ్‌ భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పారు.. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం.. హిందువుల పవిత్ర స్థలం వారణాసిపై..

Model Aparna singh: చిల్లర కామెంట్స్ ఎఫెక్ట్.. భారతీయులకు క్షమాపణలు చెప్పిన మోడల్ అపర్ణా సింగ్..
Model Aparna Singh
Shiva Prajapati
|

Updated on: Dec 02, 2022 | 3:38 PM

Share

అమెరికాలోని భారతీయ సంతతికి చెందిన మోడల్‌ అపర్ణా సింగ్‌ భారతీయ సమాజానికి క్షమాపణలు చెప్పింది. ప్రముఖ ఆధ్యాత్మిక నగరం.. హిందువుల పవిత్ర స్థలం వారణాసిపై తను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంది. కాశీ అత్యంత భయానక నగరమంటూ టిక్‌టాక్‌లో ఆమె వీడియోపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవడంతో అపర్ణ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం నోస్‌రింగ్‌తో కాశీలో పర్యటన సందర్భంగా అపర్ణాసింగ్‌ చేసిన ఈ టిక్‌టాక్‌ వీడియోపై కలకలం రేగింది.

ఇండియన్‌ అమెరికన్‌ మోడల్‌, సోషల్‌ మీడియా స్టార్‌ అపర్ణా సింగ్‌ ఆ మధ్య హిందువుల ఆధ్యాత్మిక నగరం వారణాసిని సందర్శించిన సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వారణాసి అత్యంత భయానక నగరమనీ, తన జీవితంలో తానింతవరకూ ఇలాంటి భయానక నగరాన్ని చూడలేదంటూ టిక్‌టాక్‌ వీడియోలో అపర్ణా సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో తీవ్రవ్యతిరేకత ఎదురైంది.

కాశీలోని గంగానదిలో శవాలు తేలుతున్నాయనీ, రోడ్లపైనే జనం.. వారితో పాటు కుక్కలు కూడా నిద్రిస్తోన్న ఈప్రాంతాన్ని చూస్తే.. ఒళ్ళు గగుర్పొడుస్తోందంటూ అపర్ణా సింగ్‌ కామెంట్స్ చేసింది. ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు హిందూత్వ వాదులు. అపర్ణా సింగ్‌ వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉన్నాయంటూ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అపర్ణా వివాదాస్పద టిక్‌టాక్‌పై 10 వేల మంది స్పందించినట్టు న్యూయార్క్‌ పోస్ట్‌ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

గంగానదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న కాశీనగరాన్ని హిందువులు అత్యంత పవిత్రనగరంగా భావిస్తారు. కాశీలో మరణిస్తే డైరెక్ట్‌గా స్వర్గానికి వెళతారని విశ్వసిస్తారు. అలాంటి ఆధ్యాత్మిక నగరంపై మోడల్‌ అపర్ణా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలను భారతీయ సమాజం తీవ్రంగా ఖండించింది. దీంతో అపర్ణాసింగ్‌ దిగిరాక తప్పలేదు.

అట్లాంటాకి చెందిన అపర్ణా సింగ్‌ తన ఇండియన్‌ గాడెస్‌ బొటిక్‌కి సంబంధించిన స్వర్ణాభరణాల తయారీదారులను కలిసేందుకు కాశీకి వచ్చారు. ఆ సందర్భంగా తన టిక్‌టాక్‌ వీడియోలో కాశీ అత్యంత భయానక నగరమని వ్యాఖ్యానించి వివాదాస్పదంగా మారారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..