Loud Speakers: మహారాష్ట్రలో పొలిటికల్ రీసౌండ్.. రాజ్‌థాకరే ఇచ్చిన అల్టిమేటంతో పోలీసుల్లో టెన్షన్
మసీదులపై లౌడ్‌స్పీకర్స్ తొలగించాలంటూ రాజ్‌థాకరే ఇచ్చిన అల్టిమేటం.. పొలిటికల్ రీసౌండ్ ఇస్తోంది. థాకరే ఇచ్చిన డెడ్ లైన్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆయనపై కేసు నమోదు చేయడమే కాకుండా.. అదనపు బలగాలను రంగంలోకి దించారు.
మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. మసీదులపై లౌడ్ స్పీకర్ల తొలగింపుకు ఎంఎన్‌ఎస్ ఛీప్ రాజ్‌థాక్రే విధించిన డెడ్‌లైన్ ముగియడంతో.. అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన.. MNS చీఫ్ రాజ్ ఠాక్రేపై ఔరంగాబాద్‌లో కేసు నమోదైంది. మసీదుల మీద నుంచి లౌడ్‌స్పీకర్లు తొలగించకుంటే- అక్కడ హనుమాన్ చాలీసా పఠిస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులు కేసు పెట్టారు. బహిరంగ సభ వీడియోలు చూశాక రాజ్ ఠాక్రేతోపాటు, సభ నిర్వాహకులపై పోలీసులు ఈ కేసు పెట్టారు. దీంతో రాజ్ ఠాక్రే ఇంటి దగ్గర భద్రతను పెంచారు.
మహారాష్ట్రలో అల్లర్లకు కుట్రలు జరుగుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఇందుకు బయటి వ్యక్తులను తీసుకొస్తున్నారని చెప్పారు. మరోవైపు లౌడ్‌స్పీకర్లు తొలగించాలన్న రాజ్ ఠాక్రే డిమాండ్‌పై ఆయన మండిపడ్డారు. ఎలాంటి అల్టిమేటమ్‌లు ఇక్కడ పనిచేయవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో ఉన్నది ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వమనీ, అల్టిమేటమ్ రాజకీయాలు ఇక్కడ నడవవని కరాఖండీగా చెప్పారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మహారాష్ట్ర డిజిపి రజినీష్ సింగ్ సేత్. పోలీసులకు సెలవులు రద్దు చేయడంతో పాటు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కి చెందిన 87 కంపెనీలు, 30వేల మంది హోమ్‌గార్డ్స్‌ను రంగంలోకి దింపామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..
Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?