యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్……. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో 9 మంది ఎమ్మెల్యేల భేటీ ?

యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణలు మారేట్టు కనిపిస్తోంది. బహుశా ఇందుకు సూచనగా మంగళవారం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ...

  • Publish Date - 2:11 pm, Tue, 15 June 21 Edited By: Phani CH
యూపీలో బీఎస్పీ అధినేత్రి మాయావతికి షాక్....... సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో 9 మంది ఎమ్మెల్యేల భేటీ ?
Mlas From Mayawati Meet Akh

యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణలు మారేట్టు కనిపిస్తోంది. బహుశా ఇందుకు సూచనగా మంగళవారం మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 9 మంది ఎమ్మెల్యేలు సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో భేటీ అయినట్టు తెలుస్తోంది. అస్లం రైనీ, అస్లం అలీ భేదారి, వందనా సింగ్ తదితరులతో కూడిన వీరంతా కొద్దిసేపు అఖిలేష్ యాదవ్ తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. 2017 లో జరిగిన శాసన సభ ఎన్నికల అనంతరం గత నాలుగేళ్లలో వీరిని పార్టీ నుంచి మాయావతి బహిష్కరించారు. నాటి ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ 19 సీట్లు గెలుచుకుని ఓ ఉప ఎన్నికలో ఓడిపోయింది. యూపీ అసెంబ్లీలో బీఎస్పీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 11 మందిని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంపై మాయావతి బహిష్కరించారు. అందువల్ల ప్రస్తుతం ఏడుగురు శాసన సభ్యులు మాత్రం ఉన్నారు. గత ఏడాది రాజ్యసభ ఎన్నికల సందర్భం లో కూడా ఏడుగురు రెబెల్ నేతలను ఆమె సస్పెండ్ చేశారు. కాగా అసెంబ్లీలో ప్రస్తుతమున్న వారిని ఇంకా సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించలేదు. ఇటీవల బహిష్కరణకు గురైన వారిలో ఇద్దరు సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అయితే వీరు అఖిలేష్ యాదవ్ తో భేటీ కాలేదు. ఇటీవలి పంచాయతీ ఎన్నికల్లో పార్టీని డ్యామేజీ చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి.

బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తన పార్టీ వైపు మొగ్గు చూపడం అఖిలేష్ యాదవ్ కి రాజకీయంగా లాభించవచ్చునని భావిస్తున్నారు. ప్రస్తుతానికి చూడబోతే బీఎస్పీ దాదాపు పతనావస్థలో ఉన్నట్టు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2019 లో బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు కుదిరినప్పటికీ .. రెండేళ్లలో ఈ పొత్తు విఫలమైంది. మాయావతి…అఖిలేష్ యాదవ్ చెరో దారి పట్టారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: BJP MLA Raghunandan Rao: “అభిమానులను అడ్డుకుంటారా..? హుజురాబాద్‌లో గెలుపును ఎవ‌రాపుతారో చూస్తాం “

Israel: ఇజ్రాయిల్..పాలస్తీనాల మధ్య మళ్ళీ వివాదం చెలరేగే సూచనలు..జెరూసలేం జెండా కవాతు నేపధ్యంలో ఉద్రిక్త పరిస్థితి