AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehul Choksi: క్యూబా వెళదామనుకున్నాడట…. కానీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై నోరు విప్పిన గర్ల్ ఫ్రెండ్ బార్బరా జబారికా..

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా ద్వారా క్యూబా పారిపోవాలనుకున్నాడని అతని గర్ల్ ఫ్రెండ్ బార్బరా జబారికా తెలిపింది. 'ఈ సారి మనం క్యూబాలో కలుసుకుందాం' అని ఓ సందర్భంలో అన్నాడని ఆమె చెప్పింది.

Mehul Choksi: క్యూబా వెళదామనుకున్నాడట.... కానీ వజ్రాల వ్యాపారి మెహుల్  చోక్సీపై నోరు విప్పిన గర్ల్ ఫ్రెండ్ బార్బరా జబారికా..
Mehul Choksi Girlfriend Barbara Jarabica
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 09, 2021 | 1:32 PM

వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ డొమినికా ద్వారా క్యూబా పారిపోవాలనుకున్నాడని అతని గర్ల్ ఫ్రెండ్ బార్బరా జబారికా తెలిపింది. ‘ఈ సారి మనం క్యూబాలో కలుసుకుందాం’ అని ఓ సందర్భంలో అన్నాడని ఆమె చెప్పింది. పరారీ వంటి పదాలను ఆయన వాడలేదని, కానీ తాను ఆ దేశం వెళ్లే అవకాశం ఉందని చెప్పినప్పుడు మన తదుపరి భేటీ అక్కడేనని చెప్పాడని ఆమె వెల్లడించింది. క్యూబా పరారీ ప్లాన్ గురించి మాత్రం చెప్పలేదు.. కానీ ఆయన ఫైనల్ డెస్టినేషన్ డొమినికా మాత్రం కాదని చెప్పగలను అని బార్బరా పేర్కొంది. ఆంటీగ్వాలో తాను బార్బరాను కలుసుకోవడానికి వెళ్లగా 8 నుంచి 10 మంది వచ్చి తనపై దాడి చేశారని చోక్సీ ఆంటిగ్వా పోలీసు కమిషనర్ కి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అయితే ఆ రోజున తను వెంటనే ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయానని బార్బరా చెప్పుకుంటోంది. అసలు అనవసరంగా తననెందుకు ఈ వివాదంలోకి లాగుతున్నారని ప్రశ్నించింది. చోక్సీ ని బుట్టలో పడేసేందుకు డొమినికా పోలీసులు తనను హానీ ట్రాప్ గా వాడుకున్నారని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది. నా పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఓ ఇంటార్వ్యూలో అడిగింది కూడా. ఇక తాను మెడిటేషన్ చేస్తున్నానని, న్యూయార్క్ నుంచి తనకో గురువు ఉన్నాడని, తాము మెడిటేషన్ చేస్తుంటామని..చోక్సీ ఇలా ఎన్నో కబుర్లు చెప్పేవాడని ఆమె తెలిపింది. కాగా చోక్సీ కిడ్నాప్ వ్యవహారంలో బార్బరా పాత్ర ఉందని ఆయన కుటుంబ సభ్యులు, లాయర్లు ఆరోపిస్తుండగా.. ఆమె మాత్రం వీటిని కొట్టి పారేయడం విశేషం.

తనపై లేనిపోని వదంతులు సృష్టిస్తూ వచ్చిన వార్తలను చూసి దిగ్భ్రాంతి చెందానని బార్బరా విచారం వ్యక్తం చేసింది. జనావాసాల మధ్య..పట్టపగలు ఎవరైనా కిడ్నాప్ చేయగలుగుతారా అని ఆమె ప్రశ్నించింది. కాగా చోక్సీ తనకు బంగారు నగలని చెప్పి గిల్టు నగలు ఇచ్చాడని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే.. పైగా ఫ్రెండ్ షిప్ ని తాను కోరితే రిలేషన్ షిప్ పెట్టుకుందామని చోక్సీ అన్నాడని కూడా ఆమె వెల్లడించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: TV9 Special: హిందూ ధర్మ పరిరక్షణకు టీవీ 9 విశేష కృషీ.. కక్షపూరిత ప్రచారం మానుకోవాలని హెచ్చరిక!

Karthika Deepam: మోనితతో రిలేషన్ గురించి దీపకు చెప్పాలనుకున్న కార్తీక్… సర్దుకుపొమ్మని భాగ్యం సలహా