త్రిపుల్ తలాక్‌ ఆమోదంపై మెహబూబా ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఒమర్

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా? అంటూ తన ట్వీట్‌లో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి చట్టం తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటీ? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు మెహబూబా. ఇదిలా ఉంటే పీడీపీ త్రిపుల్ తలాక్ విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. […]

త్రిపుల్ తలాక్‌ ఆమోదంపై మెహబూబా ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఒమర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 31, 2019 | 8:19 PM

దేశ రాజకీయాలను కుదిపేస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదంపై జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. దేశంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అవసరమా? అంటూ తన ట్వీట్‌లో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఒక నిర్ణయాన్ని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి చట్టం తీసుకురావడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటీ? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు మెహబూబా.

ఇదిలా ఉంటే పీడీపీ త్రిపుల్ తలాక్ విషయంలో ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఇదే విషయంపై మాట్లాడుతూ రాజ్యసభలో ఓటింగ్ సమయంలో పీడీపీకి చెందిన సభ్యులు సభలో కనిపించకపోడానికి కారణం ఏమిటని ప్రశ్నించారు. పరోక్షంగా బిల్లుపై బీజేపీకి సహకరించారని ఆరోపించారు. ఒకవైపు బిల్లును సమర్ధించేలా ప్రవర్తించి.. ఇప్పుడు అదే పార్టీపై విమర్శలు చేయడం ఏమిటన్నారు ఒమర్ అబ్దుల్లా.

త్రిపుల్ తలాక్ బిల్లు తీసుకురావాలని కేంద్రం గట్టిగా ప్రయత్నించింది. మంగళవారం రాజ్యసభలో జరిగిన ఓటింగ్ సమయంలో పీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో సభలో మెజారిటీ లేకపోయినా బిల్లు పాస్ కావడానికి పరోక్షంగా సహకరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?