కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే కగేరి
కర్ణాటక కొత్త స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. కాగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విశ్వేశ్వర పార్టీకి నమ్మకమైన నేతలలో ఒకరు. అంతేకాదు గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజ్యంగం, శాసనసభా వ్యవహారాలపై పరిఙ్ఞానం, బాషపై పట్టు ఉండటంతో స్పీకర్ పదవికి విశ్వేశ్వర సరితూగుతారని భావించిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఆయనవైపే మొగ్గుచూపారు. స్పీకర్‌గా ఎన్నిక అయిన అనంతరం విశ్వేశ్వర మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో […]

కర్ణాటక కొత్త స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర హెగ్డే కగేరి ఏకగ్రీవంగా ఎన్నియ్యారు. కాగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన విశ్వేశ్వర పార్టీకి నమ్మకమైన నేతలలో ఒకరు. అంతేకాదు గతంలో కర్ణాటక విద్యాశాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. రాజ్యంగం, శాసనసభా వ్యవహారాలపై పరిఙ్ఞానం, బాషపై పట్టు ఉండటంతో స్పీకర్ పదవికి విశ్వేశ్వర సరితూగుతారని భావించిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఆయనవైపే మొగ్గుచూపారు. స్పీకర్‌గా ఎన్నిక అయిన అనంతరం విశ్వేశ్వర మాట్లాడుతూ.. పార్టీ తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విలువలతో కూడిన సేవలందిస్తానని చెప్పారు. కాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న యడియూరప్ప ప్రస్తుతం కేబినెట్ విస్తరణపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తొలి మంత్రివర్గంలో దాదాపు 10 నుంచి 12మందిని చేర్చుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



