మిజోరం ప్రభుత్వానికి మేఘాలయ బీజేపీ మంత్రి మద్దతు.. ‘శత్రువులను’ ఎదుర్కోవలసిందేనని వ్యాఖ్య
ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రమంగా విభేదాలు పెరుగుతున్నాయి. అస్సాం-మిజోరం మధ్య కయ్యం ఇంకా కొనసాగుతుండగానే మేఘాలయాలో బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సన్ బోర్ షులాయ్ అనే ఈయన ..
ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రమంగా విభేదాలు పెరుగుతున్నాయి. అస్సాం-మిజోరం మధ్య కయ్యం ఇంకా కొనసాగుతుండగానే మేఘాలయాలో బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్య చేశారు. సన్ బోర్ షులాయ్ అనే ఈయన ..అంతర్ రాష్ట్ర సరిహద్దులను శత్రువుల నుంచి రక్షించుకోవాలంటే ఏ రాష్ట్రమైనా పోలీసు బలగాలను వినియోగించుకోవలసిందే అన్నారు. అస్సాం పోలీసులను హతమార్చవలసిందేనంటూ మిజోరాం ఎంపీ వనల్వేన చేసిన కామెంట్ ను ఈయన సమర్థించారు. మిజోరాం పోలీసులు తమ అస్తిత్వాన్ని రక్షించుకునేందుకు సమైక్యంగా ఉండి తమ సామర్థ్యాన్నీ నిరూపించుకున్నారని షులాయ్ ప్రశంసించారు. అస్సాం పోలీసులు బోర్డర్స్ లో మా వాళ్ళను వేధిస్తే ఇక మేం కూడా రియాక్ట్ కావలసిందేనని, చేతులు ముడుచుకుని కూర్చునే ప్రసక్తే ఉండదని ఆయన అన్నారు. ఏ రాష్ట్ర పోలీసులైనా తమ హద్దుల్లో ఉండాల్సిందే అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక దొంగ లేదా దోపిడీ దారు ఇంట్లో ప్రవేశిస్తే అతడిని ఇంటిలోనివారు ఎదుర్కోవలసిందేనని, అది చట్టబద్ధమైనా కాకపోయినా తప్పదని ఆయన అన్నారు. అలాగే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే ఇలా ఎదుర్కోవాలని అన్నారు. అస్సాం ను శత్రు రాష్ట్రంగా పరోక్షంగా విమర్శించారు. కాగా- మేఘాలయ కేబినెట్ లో ఈ బీజేపీ మంత్రి కొత్తగా చేరారు. సౌత్ షిల్లాంగ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన వ్యాఖ్యలను అస్సాం ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అస్సాం-నాగాలాండ్ మధ్య బోర్డర్ వివాదంపై ఉభయ రాష్ట్రాల మధ్య ఓ అంగీకారం కుదిరిన రోజే మేఘాలయ బీజేపీ మంత్రి ఇలా వ్యాఖ్యానించడం విశేషం.
మరిన్ని ఇక్కడ చూడండి : దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.