కోవిడ్ 19 పాజిటివ్ కి గురై ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్ధి మృతి, మరో 9 మంది విద్యార్థులకు పాజిటివ్

బీహార్ రాజధాని పాట్నాలో కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన ఫైనల్ ఇయర్ మెడికల్ విద్యార్ధి మరణించాడు. సుఖేందు అనే ఈ విద్యార్ధి గత నెల చివరివారంలో  మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకున్నాడు....

  • Umakanth Rao
  • Publish Date - 6:54 pm, Wed, 3 March 21
కోవిడ్ 19 పాజిటివ్ కి గురై ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్ధి మృతి, మరో 9 మంది విద్యార్థులకు పాజిటివ్

బీహార్ రాజధాని పాట్నాలో కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన ఫైనల్ ఇయర్ మెడికల్ విద్యార్ధి మరణించాడు. సుఖేందు అనే ఈ విద్యార్ధి గత నెల చివరివారంలో  మొదటి డోసు కోవాగ్జిన్ తీసుకున్నాడు. ఈ నెలలో రెండో డోసు తీసుకోవాల్సి ఉంది. నలందా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఈ విద్యార్ధి కి గత నెల 24 న ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నిర్వహించారు. అదే రోజున తన సొంత ప్రాంతం బెగుసరాయ్ కి వెళ్లాడని, అప్పటి నుంచి అస్వస్థతగా ఉన్న ఇతడు పరిస్థితి విషమించి మృతి చెందాడని తెలిసింది. హాస్టల్లో ఇతనితో బాటు ఉన్న మరో 9 మంది విద్యార్థులు కూడా కరోనా వైరస్ పాజిటివ్ కి గురయ్యారు. వారిని వెంటనే క్వారంటైన్ కి తరలించారు. సుఖేందు మృతిపై బీహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏ డాక్టర్ అయినా ఈ వైరస్ తో మరణించడం చాలా బాధ కలిగిస్తుందని అన్నారు. రోగులకు చికిత్స చేయవల్సిన  వైద్యులే ఇలా ఈ వైరస్ బారిన పడితే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా- దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 15 వేల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 98 మంది మృతి చెందారు. దీంతో  మృతుల  సంఖ్య 1,57,346 కి పెరిగింది. ఇదే సమయంలో 1,08,12,044 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97 శాతమని ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసులు 1,70,126 అని పేర్కొంది. అయితే దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం పెరిగినందున  త్వరలో కోవిడ్ మహమ్మారిని అదుపు చేయగలమని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ సహా ఇతర బీజేపీ నేతలు, ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. బీహార్ లో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తుండగా ఇతర రాష్ట్రాల్లో డోసు ప్రైవేటు హాస్పిటల్స్ లో 250 రూపాయలకు ఇస్తున్నారు.

 

మరిన్ని ఎక్కడ చదవండి:

టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే..

Actor Prabhas: ముంబైలో సెటిల్ కానున్న ప్రభాస్… ఖరీదైన ఇల్లు కోనుగోలు చేయనున్న రెబల్ స్టార్..