Mice Ate Ganja: పోలీస్ స్టేషన్ నుంచి 500 కేజీల గంజాయి మాయం.. కోర్టుకు ఖాకీలు చెప్పిన కాకి కబుర్లు..

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మరిజువానాలో జప్తు చేసిన 500 కిలోల గంజాయి ఎలుకలు తిన్నాయి. 500 కిలోల గంజాయిని ఎలుకలు ఎలా తిన్నాయని ఆశ్చర్యపోతున్నారా..? మీకు కలిగిన అనుభవమే..

Mice Ate Ganja: పోలీస్ స్టేషన్ నుంచి 500 కేజీల గంజాయి మాయం.. కోర్టుకు ఖాకీలు చెప్పిన కాకి కబుర్లు..
Mice Ate 500 Kgs Of Marijua
Follow us

|

Updated on: Nov 24, 2022 | 12:17 PM

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని మధుర పోలీసులు జప్తు చేసిన 500 కిలోల గంజాయి ఎలుకలు తిన్నాయి. 500 కిలోల గంజాయిని ఎలుకలు ఎలా తిన్నాయని ఆశ్చర్యపోతున్నారా..? మీకు కలిగిన అనుభవమే ఉత్తరప్రదేశ్‌లోని నార్కోటిక్స్ కోర్టుకు కూడా కలిగింది. షేర్‌గఢ్ పోలీసులు ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 581 కిలోల గంజాయిని జప్తు చేసిన షేర్‌గఢ్ స్టేషన్ గోదాములలో భద్రపరిచారు.దానిపై విచారణకు పిలిపించిన ఎన్డీపీఎస్ కోర్టుకు షేర్‌గఢ్ పోలీసులు విస్తుపోయే విధంగా సమాధానమిచ్చారు. గోదాములలో భద్రపరిచిన గంజాయిని ఎలుకలు తినేసాయని కోర్టు మెజిస్ట్రేట్‌కి నివేదించారు. అంతటితో ఆ మేజిస్ట్రేట్ ఏమి చెప్పలేక.. ముందుగా ఎలుకల బెడదను నివారించమని.. తర్వాత గంజాయిని ఎలుకలే తినేశాయనటానికి అధారాలను చూపమని షేర్‌గఢ్ ఎస్పీ అభిషేక్ యాదవ్‌ను ఆదేశించారు.

‘‘కోర్టు ఆదేశానుసారంగా సమయానుకూలమైన చర్యలు తీసుకుంటార’’ని మధుర సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  మార్తాండ్ పి సింగ్ తెలిపారు. అనంతరం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రణవీర్ సింగ్ మాట్లాడుతూ..‘‘గోదాములలో నిల్వ చేసిన 581 కిలోల గంజాయిని ఎలుకలు పాడు చేశాయని షేర్‌గఢ్ అండ్ హైవే పోలీస్ స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు పేర్కొన్నారు. గోదాములలో నిల్పచేసినవాటిని ఎలుకల నుంచి రక్షించడం అసాధ్యమని పోలీసులు తెలిపారు. ఎలుకల సమస్యకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది, తదుపరి విచారణ తేదీని నవంబర్ 26గా నిర్ణయించింది’’ అని తెలిపారు.

మథుర పోలీసులు కోర్టుకు ఇచ్చిన వివరణలో ‘‘ఎలుకల పరిమాణం చిన్నది, ఇంకా వాటికి పోలీసులంటే భయం లేదు. పోెలీసులు ప్రతి సమస్యను పరిష్కరించడంలో నిపుణులు కాలేరు’’ అని తెలిపారు. కాగా, 2021లో ఎటాహ్ జిల్లాలోని కొత్వాలీ దేహత్ పోలీస్ స్టేషన్‌ పోలీసులు రూ. 35 లక్షల కంటే ఎక్కువ విలువైన 1,400 కార్టన్‌ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ మద్యాన్ని కూడా ఎలుకలు ఆగం చేశాయని వారు ఇదే తరహాలో నివేదికనిచ్చారు.

ఇవి కూడా చదవండి

అయితే ఈ విషయంపై దర్యాప్తు చేయడానికి అలీఘర్‌కు చెందిన ఓ ఐపిఎస్ అధికారికి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఆగ్రా జోన్) రాజీవ్ కృష్ణ బాధ్యతలను అప్పగించారు. ఐపీఎస్ అధికారి విచారణలో తేలిన విషయమేమంటే.. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని గ్యాంగ్‌స్టర్ బంటు యాదవ్‌కు పోలీసులు విక్రయించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇంద్రేష్‌పాల్ సింగ్, హెడ్ క్లర్క్ రసాల్ సింగ్‌లపై వారి పై అధికారులు వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..