AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Love Marriage: భర్త కాదు కాలయముడు.. పెళ్లి చేసుకుని నెల తిరక్క ముందే.. చంపి గొనె సంచిలో చుట్టి…

పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖేష్‌, జెన్నిఫర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. నన్ను క్షమించండి, ఇప్పుడు అలా చేయను అని జెన్నిఫర్ .. తన భర్తను వేసుకున్నట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు.

Love Marriage: భర్త కాదు కాలయముడు.. పెళ్లి చేసుకుని నెల తిరక్క ముందే.. చంపి గొనె సంచిలో చుట్టి...
Husband Murder Her Wife
Surya Kala
|

Updated on: Nov 24, 2022 | 12:17 PM

Share

ప్రేమ, మానవత్వం అన్ని చిన్న చిన్న గొడవలకే మాయమై.. మనిషి రాక్షసుడిగా మారి తనని నమ్మి తన ఫ్యామిలీని వదులుకుని వచ్చిన యువతులను దారుణంగా హత్య చేస్తున్న కిరాతకుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఢిల్లీలో శ్రద్ధా దారుణ హత్య మరవక ముందే.. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రియురాలి దారుణ హత్య వెలుగులోకి రాగా.. ఇప్పుడు తాజాగా రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన 25 రోజులకే ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి హత్య చేశాడు. అంతేకాదు భార్య మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఓ నిర్జన ప్రదేశంలో విసిరాడు. అజ్మీర్ జిల్లాలోని క్రిస్టియన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ దంపతులు 26 రోజుల క్రితం కులాంతర వివాహం చేసుకున్నారని.. కొత్తగా పెళ్లయిన మహిళను ఆమె భర్త హత్య చేసినట్లు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

క్రిస్టియన్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా నగర్ స్ట్రీట్ నంబర్-4లో నివసించే ముఖేష్ సింధీ (34) నయాబజార్‌లో బట్టల దుకాణం నడుపుతున్నాడు. గత సంవత్సరం ఆగస్టులో ముఖేష్ స్నేహితుడు రమేష్ ..  భగవాన్ గంజ్‌లో నివసించే జెన్నిఫర్ (32)ని  పరిచయం చేశాడు. ఇద్దరు ప్రేమించుకుని 26 రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు. పెళ్లి తర్వాత ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖేష్‌, జెన్నిఫర్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉదయం 11 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది. నన్ను క్షమించండి, ఇప్పుడు అలా చేయను అని జెన్నిఫర్ .. తన భర్తను వేసుకున్నట్లు ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. అయితే మహిళ వేడుకున్న కొంతసేపటికి ఇంట్లో నుంచి ఎటువంటి శబ్దాలు రాలేదని.. కొంతసేపటికి ముఖేష్ ఇంటి నుంచి .. ఓ గొనె సంచిని తీసుకుని బయటకు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఇరుగుపొరుగు వారి కథనం ప్రకారం.. ముఖేష్ ఓ గోనె సంచితో ఇంటి నుంచి బయటకు వచ్చి.. ఆ సంచిని స్కూటీపై ఉంచుతుండగా గొనె సంచి కింద పడింది. అదే సమయంలో పొరుగువారు గోనె సంచిలో మృతదేహాన్ని చూశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అంతేకాదు జెన్నీ ఫర్ తో  ముఖేష్ గొడవ పడడమే కాదు.. చాలా దారుణంగా కొట్టినట్లు శబ్దాలు వినిపించాయని చెబుతున్నారు. తనను వదిలేయమని భర్తను ఆమె వేసుకున్నట్లు.. అయితే భర్తను భార్య వేడుకోలు కరిగించలేదని.. కసాయిగా మారి గొంతు కోసి హత్య చేసినట్లు స్థానికులు కథనం.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి తాళం పగలగొట్టి పరిశీలించగా రక్తపు ఆనవాళ్లు కనిపించాయి. ఇంతలో..  మృతదేహాన్ని బయట పడేసిన ముఖేష్ ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్న పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడిని వెంబడించిన పోలీసులు కలెక్టరేట్ సమీపంలో పట్టుకున్నారు.

పోలీసుల విచారణలో తన భార్యను హత్య చేసి శవాన్ని పుష్కర్ ప్రాంతంలో పడేసినట్లు భర్త చెప్పాడు. ముఖేష్ ఈ ఇంటిని మూడేళ్ల క్రితం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారంలో తెలిసింది. ప్రస్తుతం నిందితుడు ముఖేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జెన్నిఫర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న జెన్నిఫర్ తల్లి ఆమెను పెంచింది. బాధితురాలి సోదరుడు ముఖేష్ కట్నం డిమాండ్ చేస్తున్నాడని ..  ఆమెపై ఒత్తిడి చేస్తున్నాడని ఫిర్యాదు చేశాడు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..