AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణకు మరో ఆపద..గంటకు 15కి. మీ వేగంతో దూసుకొస్తున్న..

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలను స్వాహా చేసేస్తున్నాయి. ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే..అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రైతాంగంలో కలవరం మొదలైంది. మిడతలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం […]

తెలంగాణకు మరో ఆపద..గంటకు 15కి. మీ వేగంతో దూసుకొస్తున్న..
Jyothi Gadda
|

Updated on: May 27, 2020 | 1:48 PM

Share

పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి దూసుకొచ్చిన లక్షలాది మిడతల దండు దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలను స్వాహా చేసేస్తున్నాయి. ఇప్పటికే యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల్లో పంట ధ్వంసమైంది. తాజాగా అవి మహారాష్ట్రలోని అమరావతిలోకి కూడా ప్రవేశించాయి. అక్కడి అధికారులు వీటిని పారద్రోలేందుకు నియంత్రణ చేర్యలు చేపడుతుండగా, వాటి నియంత్రణ సాధ్యం కాకుంటే..అవి తెలంగాణలోకి వచ్చే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రైతాంగంలో కలవరం మొదలైంది.

మిడతలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు అప్రమత్తమైన వ్యవసాయ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి, నిపుణలుతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. సరిహద్దు జిల్లాల్లో రసాయనాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ మిడతల దండు గంటకు 15 కిలోమీటర్ల వరకూ ప్రయాణిస్తూ.. చెట్లపై నివాసం ఉంటూ..పంటలకు నష్టం కలిగిస్తున్నాయని వెల్లడించారు జనార్థన్ రెడ్డి, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, భూపాలపల్లి, నిర్మల్, కామారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రతి గ్రామంలో రసాయానాలు సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో రైతుల్లో అవగాహన పెంచాలని తెలిపారు.

పంటలను నాశనం చేస్తున్న మిడతల దండు 1993 తర్వాత మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్ టెక్నాలజీ అప్లికేషన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఏటీఏఆర్ఐ) ఎక్స్ జోన్ డైరెక్టర్ డా. వైజీ ప్రసాద్ తెలిపారు. మిడతలు ప్రతి రోజు ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటుందని, తన బరువుకు సమానమైన ఆహారం తీసుకునే జీవిగా వెల్లడించారు. దీనికి తోడు వాటిలో సంతానోత్పత్తి కూడా వేగంగా జరుగుతుందని అన్నారు. ఈ లెక్కన చూస్తే .. వాటిని త్వరగా వెనక్కి పంపించకపోతే.. పాక్ నుంచి వచ్చిన మిడతల సంఖ్య దాదాపుగా 400 రేట్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ సరిహద్దుకు 400కి.మీ దూరంలో ఈ మిడతల దండు ఉందని.. రాష్ట్రంలోకి అవి వస్తాయా..? రావా..? అనేది 2 రోజుల్లో తెలుస్తుందన్నారు. సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశామని, మిడతల కట్టడికి జనావాసాల్లో మందులు పిచికారీ చేయొద్దని సూచించారు.

* అసలు మిడతలు ఎంత డేంజరో తెలుసా..? * పంటలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. * కేవలం మొక్కలను మాత్రమే ఆరగిస్తాయి. * గుంపులుగా దండెత్తితే పైరు ఆనవాళ్లు కూడా కనిపించవు * రోజులో 150 కి.మీ వరకు ప్రయాణిస్తాయి. * కి. మీ పరిధి గల ప్రాంతాన్ని 8 కోట్ల మిడతలు ఆక్రమించగలవు * 35 వేల మంది సరిపోయే ఆహారాన్ని ఒక్కరోజులో తినేస్తాయి.