ప్రైవేటులో కరోనా చికిత్సలెందుకొద్దు? కేంద్రానికి సుప్రీం ప్రశ్న

కరోనా పరీక్షలను, చికిత్సలను ప్రభుత్వ రంగ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పాండమిక్ సిచ్యుయేషన్‌ని...

ప్రైవేటులో కరోనా చికిత్సలెందుకొద్దు? కేంద్రానికి సుప్రీం ప్రశ్న
Follow us

|

Updated on: May 27, 2020 | 2:51 PM

Supreme court questioned center about why not corona treatment in private hospitals: కరోనా పరీక్షలను, చికిత్సలను ప్రభుత్వ రంగ ఆసుపత్రులకు మాత్రమే పరిమితం చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. పాండమిక్ సిచ్యుయేషన్‌ని ఎదుర్కొనేందుకు ప్రైవేటు రంగంలోని ఆసుపత్రులను కూడా రంగంలోకి దింపితే తప్పేంటని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

లాక్ డౌన్ మెల్లిగా ఎత్తివేస్తున్న తరుణంలో కరోనా కేసులు పెరిగే ప్రమాదం వుందని అభిప్రాయపడిన సుప్రీం కోర్టు ధర్మాసనం దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల్లోను ట్రీట్‌మెంట్ ప్రారంభం కావాల్సి వుందని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. ప్రైవేటు ఆసుపత్రుల్లోను ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి నిర్దేశించింది.

ప్రైవేటు ఆసుపత్రులను కరోనాపై యుద్ధంలో భాగస్వాములను చేసే విషయంపై తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. ఈలోగా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా పరీక్షలు, చికిత్సలు చేసేందుకు ముందుకొచ్చే ప్రైవేటు ఆసుపత్రులు, ఛారిటబుల్ ట్రస్టులను గుర్తించాలని కేంద్రానికి సూచించింది. పూర్తిగా ఉచితంగా గానీ, లేదా నామమాత్రపు ఫీజులతోను కరోనా పరీక్షలు నిర్వహించి, చికిత్స అందించేందుకు ఎవరైనా ముందుకొస్తే వారికి అవకాశం ఇవ్వడంలో తప్పు లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో కేంద్ర సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించింది.