తగ్గనున్న ‘కరోనా టెస్ట్’ ధరలు.. ఐసీఎంఆర్ కీలక నిర్ణయం..

కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలపై ఐసీఎంఆర్

తగ్గనున్న 'కరోనా టెస్ట్' ధరలు.. ఐసీఎంఆర్ కీలక నిర్ణయం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 27, 2020 | 3:46 PM

Coronavirus testing to get cheaper: కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకి రూపాంతరం చెందుతూ మరింత బలంగా తయారవుతోంది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విస్తృత వేగంతో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో కరోనా పరీక్షలపై ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిపల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల కోసం గతంలోనే కొన్ని ప్రైవేట్ ల్యాబ్స్‌కు అనుమతి ఇచ్చిన ఐసీఎంఆర్… టెస్టుల ధరను రూ. 4500గా నిర్ణయించింది. అయితే తాజాగా దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆయా రాష్ట్రాలకు అప్పగించింది.

ఎందుకంటే.. ప్రస్తుతం భారత్ లో కోవిద్-19 టెస్ట్ కిట్లు భారీగా అందుబాటులో ఉండటంతో పాటు, ప్రైవేట్ ల్యాబ్‌ల మధ్య విపరీతమైన పోటీ నేపథ్యంలో ధరలు దిగి వచ్చే అవకాశం వుందని ఐసీఎంఆర్ తెలిపింది. అందుకే ఈ విషయంలో రాష్ట్రాలు, ప్రైవేట్ ల్యాబ్‌లు, సంస్థలు పరస్పర అంగీకారంతో ధర నిర్ణయించుకోవచ్చని లేఖలో పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 428 ప్రభుత్వ ప్రయోగశాలలు, 182 ప్రైవేట్ ల్యాబ్‌లు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం అందుబాటులో ఉన్నాయి.

కాగా.. ప్రస్తుతం రోజుకు లక్ష కరోనా పరీక్షలు చేసే సామర్థ్యానికి దేశం చేరుకుందని ప్రకటించింది. ఈ పరీక్షల సామర్థ్యాన్ని రోజుకు 2 లక్షల పరీక్షలకు పెంచాలని భావిస్తోంది. ఇక రాబోయే నెల రోజుల్లో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తుండటంతో… ఐసీఎంఆర్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

Also Read: వీడిన ఆకుపచ్చ కోడిగుడ్ల మిస్టరీ.. అసలు కారణం ఏంటంటే?

Latest Articles
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఈ అమ్మాయి చంద్రముఖి సినిమా చైల్డ్ ఆర్టిస్టా..? ఇంత అందంగా..
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
ఎండ కొంప ముంచుతుందంట జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే బీకేర్‌ఫుల్
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
అందరూ ఎంచక్కా ఈత కొడుతుంటే.. ఒక్కసారి దూసుకొచ్చిన అనుకోని అతిధి..
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
వేములవాడకు నరేంద్ర మోదీ.. తొలి ప్రధానిగా రికార్డు!
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
కొత్త మట్టి పాత్రలు కొన్నారా.. వెంటనే ఈ పనులు చేయండి..
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఒక్క పోస్ట్‌తో స్కామర్‌కు చుక్కలు.. నెంబర్ సహా 20 ఫోన్లు బ్లాక్
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
ఓట్ల కోసం నేతల పాట్లు - గెలుపు మాదంటే మాదని ధీమా!
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
టీమిండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ధరెంతో తెలుసా?ఎక్కడ దొరుకుతాయంటే?
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ప్రపంచంలోనే ఫస్ట్ సీఎన్‌జీ బైక్.. లాంచింగ్‌కు ముహూర్తం ఫిక్స్..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..
బీరు తాగేటప్పుడు ఈ ఆహారపదార్ధాలు తింటే ఇక మీ ఆరోగ్యం షెడ్డుకే..