కరోనా నుంచి బయటపడ్డ ఖైదీలు.. అంతేకాదు..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షన్నరకు చేరువలో కేసులు ఉన్నాయి. కరోనా బారినపడి నాలుగువేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. అక్కడి రోహిణి సెంట్రల్‌ జైలుకు చెందిన ఖైదీలకు, ఓ ఉద్యోగికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న వారికి కరోనా సోకడంతో.. అందులో ఉన్న ఖైదీలు, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. మొత్తం 16 మందికి కరోనా […]

కరోనా నుంచి బయటపడ్డ ఖైదీలు.. అంతేకాదు..
Follow us

| Edited By:

Updated on: May 27, 2020 | 2:20 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లక్షన్నరకు చేరువలో కేసులు ఉన్నాయి. కరోనా బారినపడి నాలుగువేలకుపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా ఉంది. అక్కడి రోహిణి సెంట్రల్‌ జైలుకు చెందిన ఖైదీలకు, ఓ ఉద్యోగికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న వారికి కరోనా సోకడంతో.. అందులో ఉన్న ఖైదీలు, ఉద్యోగులు భయబ్రాంతులకు గురయ్యారు. మొత్తం 16 మందికి కరోనా సోకగా.. వారిని సోనిపట్‌లోని క్వారంటైన్‌ సెంటర్‌కు తరలించి చికిత్స అందించారు. వీరిలో ప్రస్తుతం 10 మంది ఖైదీలతో పాటు.. జైలు ఉద్యోగి కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. జైలులో ఉన్న మిగతా ఖైదీలకు కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జైలు అధికారులు వెల్లడించారు.