AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: సినిమా స్టైల్ లో చోరీ.. తుపాకీ గురిపెట్టి.. భారీగా నగల దోపిడి.. విలువ ఎంతంటే..

ముసుగులు ధరించి ప్రవేశించడం, బ్యాగులో తుపాకీలు తీసి బెదిరించి.. తాళాలు అడగడం.. ఇవ్వకపోతే.. కొట్టడం, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించడం.. ఏందీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.. నిజమే ఇలాంటివి సినిమాలోనే ఎక్కువుగా చూస్తాం. రియల్ గా బ్యాంకు..

Crime: సినిమా స్టైల్ లో చోరీ.. తుపాకీ గురిపెట్టి.. భారీగా నగల దోపిడి.. విలువ ఎంతంటే..
Chory
Amarnadh Daneti
|

Updated on: Aug 30, 2022 | 8:09 AM

Share

Crime News: ముసుగులు ధరించి ప్రవేశించడం, బ్యాగులో తుపాకీలు తీసి బెదిరించి.. తాళాలు అడగడం.. ఇవ్వకపోతే.. కొట్టడం, తలపై తుపాకీ గురిపెట్టి చంపేస్తానని బెదిరించడం.. ఏందీ ఇదేదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా.. నిజమే ఇలాంటివి సినిమాలోనే ఎక్కువుగా చూస్తాం. రియల్ గా బ్యాంకు దోపిడిలు, భారీ చోరీలు చూసినా.. ఈస్టైల్ లో చోరీలను చూసుండకపోవచ్చు. సైబర్ నేరగాళ్లు అయితే బ్యాంకు సైట్ లను హ్యాక్ చేసి భారీగా నగదు చోరికి పాల్పడిన ఘటనలు చూశాం. కాని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఇలాంటి చోరి ఒకటి కలకలం రేపుతోంది. చోరీ జరిగి 24 గంటలు గడిచినా నేరగాళ్ల ఆచూకీ దొరకలేదు. పక్కా స్కెచ్ తో సుమారు రూ.12 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదు దోచుకెళ్లారు దుండగులు. ఉదయ్‌పూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయాన్ని సోమవారం ఉదయం ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమయ్యారు.

ఉదయపూర్‌లోని ప్రతాప్ నగర్‌లోని వాణిజ్య భవనంలోని మొదటి అంతస్తులో ఉన్న మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలోకి ఉదయం 9.30 నిమిషాల ప్రాంతంలో సెక్యూరిటీ లేని గేటు నుంచి ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు లోపలకి చొరబడ్డారు. దుండగులు వచ్చినప్పుడు మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ కార్యాలయంలో ఐదుగురు ఉద్యోగులు, ఓ ఖాతాదారుడు ఉన్నారు. ఒక్కో దుండగుడు ఒక్కో ప్రదేశానికి వెళ్లి వారి బ్యాగుల్లో తుపాకీలు తీసి అక్కడ పనిచేసే ఉద్యోగులను బెదిరించారు. మేనేజర్ క్యాబిన్ తో పాటు, బంగారం, నగదు భద్రపరిచే గదిలోకి దుండగులు ప్రవేశించారు. కార్యాలయంలోని ప్రధాన గదిలో ఉన్న వారందరినీ ఒక మూలకు వెళ్లాలని తుపాకీ గురిపెట్టి బెదిరించారు. వెళ్లకపోతే ఉద్యోగులు, కస్టమర్ ను కాల్చివేస్తామని బెదిరించారు. వారి మొబైల్ ఫోన్లు తీసుకుని ల్యాండ్‌లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. వీరందరికి ఓ దుండగుడు కాపాల ఉండగా.. మిగిలిన వారంతా స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ భద్రపర్చిన తాకట్టుకు వచ్చిన నగలును బ్యాగుల్లో సర్దుకున్నారు. దాదాపు 20 కిలోల బంగారాన్ని దుండగులు పట్టుకుని వెళ్లిపోయారు. మణ్ణప్పురం సిబ్బంది దుండగులతో వాగ్వాదం పెట్టుకోగా పలుమార్లు సిబ్బందిని దుండగులు కొట్టినట్లు పోలీసులకు కార్యాలయం మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కార్యాలయం నుంచి దుండగులు బయటకు వెళ్లేటప్పుడు మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ చేతులు కట్టేసి, మిగిలినవారు బయటకు రాకుండా ఆఫీసు ప్రధాన ద్వారాన్ని లాక్ చేసి పరారయ్యారు. దుండగులు బైక్ పై వచ్చినట్లు సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. పది నిమిషాల వ్యవధిలో ఈచోరీ మొత్తం పూర్తయింది. ప్రతాప్ నగర్ లోని మణ్ణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ లో దాదాపు 1100 మంది కస్టమర్లు ఉన్నట్లు తెలుస్తోంది. దుండగులను పట్టుకోవడానికి పోలీసులు జిల్లా వ్యాప్తంగా అలర్ట్ ప్రకటించారు. ఈచోరీలో సంస్థ ఉద్యోగుల ప్రమేయంపై కూడా విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ బ్రాంచిలో సెక్యూరిటీ లేకపోవడంపై పోలీసు అధికారులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డులను నియమించకూడదనేది కంపెనీ విధానంగా బ్యాంకు మేనేజర్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..