Bharat Bandh: భారత్ బంద్‌కు మా మద్దతు.. ఆడియో టేపును విడుదల చేసిన మావోయిస్టులు
మావోయిస్టు గణేష్ పేరిట ఆడియో టేపు విడుదలైంది. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. రేపటి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజల వెంటే మేముంటామని ప్రకటించారు.
Maoists back farmers: మావోయిస్టు గణేష్ పేరిట ఆడియో టేపు విడుదలైంది. స్టీల్ ప్లాంట్ కార్మికులకు మావోయిస్టులు మద్దతు ప్రకటించారు. రేపటి భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక, కర్షక, ప్రజల వెంటే మేముంటామని ప్రకటించారు. స్టీల్ ప్లాంట్‌పై పాలకవర్గాల మాటలు నమ్మొద్దు అంటూ అందులో పేర్కొన్నారు. ఈ ఆడియో టేప్‌లో మావోయిస్టు కార్యదర్శి గణేష్ మాట్లాడినట్లుగా తెలుస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా శుక్రవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. దేశ పౌరులంతా శుక్రవారం బంద్‌ను విజయవంతం చేయాలంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామీణ స్థాయిలో కూడా బంద్ కొనసాగించాలని దేశ పౌరులను కోరుతున్నారు. నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు.. రేపు బంద్‌కు పిలుపునిచ్చారు. రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చింది అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా.
వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు రైతులు. పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చే క్రమంలో భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు.
బంద్‌ను సక్సెస్ చేసేందుకు వామపక్షాలు రోడ్డెక్కబోతున్నాయి. మోదీ ప్రభుత్వం కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ వామపక్ష పార్టీల నాయకులు మండిపడుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలను నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటి బంద్‌కు వ్యాపార, విద్యా సంస్థలు సహకరించాలని కోరుతున్నారు.
బంద్ నేపథ్యంలో జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు నిర్వహించతలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రైతులు, కార్మికులు చేసే ఆందోళనకు వైసీపీ సహా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతిస్తోందని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
బంద్ నేపథ్యంలో ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్న ఏపీ ప్రభుత్వం.. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. భారత్ బంద్‌కు ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు మద్దతు ప్రకటించారు.