Maoists: మావోయిస్ట్‌ల బీభత్సం.. రైలుపట్టాలు తొలగింపు.. ఉద్రిక్త పరిస్థితులు
చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్ట్‌లు బీభత్సం సృష్టించారు. దంతేవాడ జిల్లా భాన్సీ,కమలూర్ మధ్యలో రైలుపట్టాలు తొలగించారు.
చత్తీస్ ఘడ్ ఎన్‌కౌంటర్ తరువాత మావోయిస్ట్‌లు బీభత్సం సృష్టించారు. దంతేవాడ జిల్లా భాన్సీ, కమలూర్ మధ్యలో రైలుపట్టాలు తొలగించారు. దీంతో కిరండోల్ నుండి విశాఖపట్నంకి ఐరన్ ఓర్ లోడుతో వెళుతున్న రైలు పట్టాలు తప్పి 20 బోగీలు పడిపోయాయి. సాయుధులైన మావోయిస్టులు 50 నుండి 60 మంది భారీ పేలుడు పదార్థాలతో పేల్చినట్టు అధికారులు చెబుతున్నారు. తరువాత రైల్వే సిబ్బంది వద్ద ఉన్న వాకీ టాకీలను తీసుకుని వారిని వదిలిపెట్టారు మావోయిస్ట్‌లు. బంద్ పిలుపు నేపధ్యంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు జిల్లా sp వెల్లడించారు. రైలు ఇంజిన్ కు పోస్టర్, బ్యానర్ కట్టారు.
అటు నారాయణ్ పూర్ జిల్లా ఫరస్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మారి పంచాయతి సర్పంచ్ భర్త బిర్జురామ్ సాలంను కత్తులతో పొడిచి చంపారు. గ్రామంలో బీభత్సం సృష్టించి JCBని తగులబెట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రముఖుల ఇళ్ల వద్ద భద్రత కట్టదిట్టం చేశారు.
Also Read: అధిక వడ్డీ ఆశ.. కి’లేడీ’ ట్రాప్‌లో సినిమా స్టార్స్
Ramagundam: సంచలనం.. రోడ్డు పక్కన వ్యక్తి తల, రెండు వేర్వేరు చేతులు..