17 మంది క్షతగాత్రులను పట్టుకొని చంపేశారు..! పోలీసులపై మావోయిస్టుల సంచలన లేఖ
వీరమరణం పొందిన 35 మంది మృతుల జాబితాను లేఖ ద్వారా విడుదల చేసిన మావోయిస్టులు, అమరవీర మావోయిస్టులను స్మరిస్తూ గ్రామగ్రామాన సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మారణహోమానికి, అణచివేతకు వ్యతిరేకంగా
తూర్పు బస్తర్ డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్టు లేఖ విడుదల చేశారు ..అక్టోబర్ 4 న అబూజ్ మడ్ ఎన్‌కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు ప్రకటించారు..ఎన్ కౌంటర్ జరిగి రెండు వారాలు అయినా మావోయిస్టులు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చర్చకు దారి తీసింది..సాధారణంగా ఏ ఘటన, ఎన్ కౌంటర్ జరిగినా వెంటనే మావోయిస్టులు పూర్తి వివరాలతో లేఖలు విడుదల చేస్తారు..కానీ తన కంచుకోట అయిన అబూజ్ మడ్ లో భద్రతా బలగాలు చొచ్చుకొని వచ్చి..కాల్పులు జరపడంతో భారీ నష్టం జరిగింది..ఎంత మంది మృతి చెందారు..ఎవరు మృతి చెందారనే దానిపై వెంటనే స్పష్టత రాలేదు.. వారోత్సవాల వేళ భారీ ఎదురు దెబ్బ తగలడంతో ఆత్మ రక్షణ లో పడ్డ మావోయిస్టులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం..నిర్దారణ చేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నారని, అందుకే ఆలస్యం అయ్యిందని చర్చ జరుగుతోంది.
నారాయణపూర్ జిల్లా బొండాస్ తులాతులి అటవీప్రాంతంలో పోలీసుల ఊచకోతను వ్యతిరేకించి గొంతు ఎత్తండని పిలుపు ఇచ్చారు. పోలీస్ బలగాల కాల్పుల్లో 14 మంది మృతి చెందగా గాయపడిన 17 మందిని దారుణంగా హత్య చేశారనీ మావోయిస్టులు లేఖలో ఆరోపించారు. ఎన్‌కౌంటర్ ఘటనాస్థలాన్ని సందర్శించి వాస్తవాలను ప్రపంచానికి తెలిపి న్యాయ విచారణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. జరిగిన ఎన్‌కౌంటర్‌ను అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకించి ఖండించాలన్నారు.
వీరమరణం పొందిన 35 మంది మృతుల జాబితాను లేఖ ద్వారా విడుదల చేసిన మావోయిస్టులు, అమరవీర మావోయిస్టులను స్మరిస్తూ గ్రామగ్రామాన సంస్మరణ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మారణహోమానికి, అణచివేతకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక, ప్రగతిశీల, లౌకిక, విప్లవ సామాజిక సంస్థలు తమ గళాన్ని వినిపించాలనీ పిలుపు ఇచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..